మోహన్ బాబుకు సింహాసనం ఇచ్చిన మంచు లక్ష్మి

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ ఏడాది మార్చి 19న తన పుట్టినరోజున శ్రీవిద్యానికేతన్‌లో జరగాల్సిన వార్షికోత్సవ వేడుకలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసినట్లు అయన వెల్లడించారు. నిన్న పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న మోహన్ బాబుకు, ఆయన కుమార్తె లక్ష్మి, వినూత్నమైన, మరచిపోలేని కానుకను బహుమతిగా ఇచ్చారు. ఆయన కోసం ఓ సింహాసనాన్ని తయారు చేయించిన మంచు లక్ష్మి, ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మా నాన్నకు కొత్త సింహాసనం. ఈ సింహాసనంలోని మూడు సింహాలు, మా ముగ్గురికీ నిదర్శనం. దీన్ని నేనే చేయించాను అని కామెంట్ పెట్టారు.

Read Previous

విశాఖపట్నంలో హై అలర్ట్‌: ఏపీ ప్రభుత్వం

Read Next

బాలుడితో వివాహిత ఎఫైర్: భరించలేక చంపేసిన బాలుడు