రామ్ చరణ్ వద్దన్న కథ రామ్ చేస్తున్నాడట
Timeline

రామ్ చరణ్ వద్దన్న కథ రామ్ చేస్తున్నాడట

RRR షూటింగ్ త్వరలోనే పూర్తవుతుంది. మరి దీని తరవాత చేయబోయే చిత్రం ఏమిటి అనేది ఇప్పుడు అభిమానుల్లో మొదలైన ప్రశ్న. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా కథలు వినే పనిలో ఉన్నారట. ఇప్పటికే ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుముల కథ చెప్పారని అయితే, ఈ కథ చరణ్‌కు నచ్చలేదని తెలుస్తోంది. వెంకీ కుడుముల నెరేషన్‌‌తో చరణ్‌ను ఇంప్రెస్ చేయలేకపోయారని అంటున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల చేద్దామని ప్లాం చేసాడట. కానీ, చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో వెంకీ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లోనే ‘భీష్మ’ సినిమాను వెంకీ చేశారు.

అయితే ఇప్పుడు ఈ కథ హీరో రామ్ చేతిలో పడిందని సమాచారం. హీరో రామ్ కి ఈ కథ బాగా నచ్చడంతో త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ మీదికి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. హీరో రామ్ ఈ మధ్య కొందరు యంగ్ డైరెక్టర్స్ కి తన ఇంట్లో ట్రీట్ కూడా ఇచ్చాడు. ఆ లిస్టులో వెంకీ కూడా ఉన్నాడు. రామ్ కిశోరె తిరుమల దర్శకత్వంలో నటించిన రెడ్ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేసాడు. ఇది తమిళ్ సినిమా రీమేక్.

Leave a Reply

Your email address will not be published.