భర్తతో కలిసి శాంతి మెస్ లో కాజల్ అగర్వాల్
Timeline Tollywood Viral

భర్తతో కలిసి శాంతి మెస్ లో కాజల్ అగర్వాల్

సినిమా షూటింగ్ల కోసం హీరోలు హీరోయిన్లు సినిమా బృందం వివిధ ప్రదేశాలకు షూటింగ్ల నిమిత్తం వెళ్ళవలసి ఉంటుంది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తమ కుటుంబాలకు దూరంగా వెళ్లి అక్కడ షూటింగులో పాల్గొన వలసిన అవసరాలు ఏర్పడతాయి. అందులో భాగంగా ఆ ప్రదేశాల్లో ఏది దొరికితే దానితోనే కడుపు నింపుకునే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మనం అనుకున్నట్టుగా హీరోలు హీరోయిన్లు అక్కడ దగ్గర్లో ఉన్న పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్తారు అనుకోవడం పొరపాటు. వాళ్లు అందరిలాగే ప్రొడక్షన్ ఫుడ్ తోనే కడుపు నింపుకుంటారు.

మనదేశంలో సినిమా షూటింగ్లకు ఎక్కువగా తమిళనాడులోని పొల్లాచ్చి కి వెళ్తూ ఉంటారు. అక్కడ పెద్దపెద్ద రెస్టారెంట్లు ఉండవు.

అయితే పొల్లాచ్చిలో 27 సంవత్సరాలుగా శాంతి మెస్ సినిమా షూటింగ్ లకు వచ్చే సినీ బృందాలకు హీరో హీరోయిన్లకు మంచి ఆహారం లభించే అడ్డాగా మారింది. ఈ విషయాన్ని టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన ట్విట్టర్ వేదికపై అభిమానులతో పంచుకుంది. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం అక్కడికి వెళ్ళిన కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి భోజనం చేయడానికి శాంతి మెస్ కి వెళ్ళింది.

అక్కడ భోజనం ఎంతో బాగుంటుందని 27 సంవత్సరాలుగా వారు అక్కడ శాంతి ఇమేజెస్ నడుపుతున్నారని, అక్కడ ప్రేమతో వారు వడ్డించే భోజనం అంటే తనకు ఎంతో ఇష్టమని కాజల్ తెలిపింది. అంతేకాకుండా తన భర్తతో కలిసి శాంతి మెస్ ఓనర్ లతో ఫోటో కూడా దిగింది. ఆ ఫోటోలను తన ట్విట్టర్ వేదికపై పంచుకుంది.

Leave a Reply

Your email address will not be published.