అస్సలు గ్యాప్ ఇవ్వదట …
Timeline

అస్సలు గ్యాప్ ఇవ్వదట …

కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదలై దశాబ్దం అవుతోన్న కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల చందమామ. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతోనే ఉంది. ఓ వైపు కుర్ర హీరోలతో నటిస్తూనే సినీయర్స్‌తో కూడా రొమాన్స్ చేస్తోంది. డైరెక్టర్ తేజ ‘లక్ష్మీ కళ్యాణం’తో తెలుగు సినిమాలకు పరిచయమైనా… క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ‘చందమామ’ సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఇక అప్పటినుండి.. వెనుకకు చూసింది లేదు కాజల్. తెలుగువారిని తన అందచందాలతో, ఎవరని నొప్పించని మనసుతో అలరిస్తూనే ఉంది. తెలుగులో దాదాపు అందరీ హీరోలతో నటించింది.

అది అలా ఉంటే కాజల్‌ పెళ్లి కుమార్తె కాబోతున్న విషయం తెలిసిందే. తన పెళ్లికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా తీపి కబురు వినిపించింది కాజల్. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో ఈ నెల 30న ముంబైలో తన వివాహం జరగబోతున్నట్లు కాజల్‌ అధికారికంగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక కుటుంబ సభ్యులు కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో కాజల్ గౌతమ్ ల నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. వివాహనికి ఇంకా ఒకరోజు మాత్రమే ఉన్న నేపథ్యంలో తాజాగా మెహందీ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాజల్ గురువారం తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

అయితే పెళ్ళికి ముందు కాజల్ కమిట్ అయిన సినిమాల లెక్క చాలా పెద్దదే. అవన్నీ కంప్లీట్ అయ్యాక మాత్రమే పెళ్లి చేసుకోవాలని అనుకుందట కాజల్. కానీ కరోనా కారణంగా షూటింగులు ఆగిపోవటం, సరే పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి అయ్యాక విహార యాత్రలకు వెళ్లే అవకాశము కూడా లేకపోవడంతో పెళ్లి తేదీ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఈ నెలలో పెళ్లి చేసేసుకుందాం అని డిసైడ్ అయింది. ఒకవేళ షూటింగులు షురూ అయితే వెంటనే అవి కంప్లీట్ చేసి భర్తతో విదేశాలు వెళ్లి మల్లి తిరిగొచ్చి సినిమా జీవితం కంటిన్యూ చేస్తా అంటుంది కాజల్.

ప్రస్తుతం చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం తాజా షెడ్యూలును నవంబర్ 2 నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి కూడా ఈ షూటింగులో పాల్గొంటారు. దీంతో నవంబర్ రెండో వారంలో కాజల్ ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతుందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో ఈ ‘ఆచార్య’ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే.