బిగ్ బ్రేకింగ్: ఆర్టీసీ మ్యాటర్ లో చేతులెత్తేసిన హైకోర్టు

126

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ ముగిసింది. సమ్మె చట్ట విరుద్ధమని అడిషనల్ ఏజీ రాంచందర్ రావు వాదించారు. సమ్మెకు వెళ్లే ముందు కార్మికులు నోటీస్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. నోటీస్ ఇచ్చిన తర్వాత కనీసం ఆరు వారాలు ఆర్టీసీ నిర్ణయం కోసం ఎదురు చూడాలని పేర్కొన్నారు. కార్మికులు చట్టప్రకారం నడుచుకొలేదని అన్నారు.

సమ్మె విరుద్ధమని చెప్పే హక్కు కార్మిక న్యాయస్థానానికి మాత్రమే ఉందని హైకోర్టు పేర్కొంది. కార్మికుల సమస్యలపై స్పందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆర్టీసీ ఐకాస తరఫు న్యాయవాది కోరారు. ప్రభుత్వం కమిటీ వేయడానికి సిద్ధంగా లేదని హైకోర్టు తెలిపింది.

ఆర్టీసీ ఎండీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విధంగా ఉందని ఆర్టీసీ ఐకాస తరఫు న్యాయవాది ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. కార్మికులు సమ్మెను విరమించి విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్మికులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకో వద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి రహస్య అజెండా ఉందని చెప్పారు. 

పరిమితులు దాటలేం: హైకోర్టు

హైకోర్టుకు ఉన్న పరిమితులు దాటి ముందుకు పోలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. రెండు వారాల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని పేర్కొంది.

హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగిసింది. సమ్మెపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని లేబర్‌ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. సమ్మె చట్టబద్ధమా.. వ్యతిరేకమా అని నిర్ణయించే అధికారం కార్మిక న్యాయస్థానానికే ఉందని ధర్మాసనం తేల్చిచెప్పింది. చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమన్న హైకోర్టు…చర్చలు స్వచ్ఛందంగా, సామరస్యంగా జరగాలని ఆకాంక్షించింది.

సమ్మె చట్ట విరుద్ధమని వాదించిన అడిషనల్ ఏజీ రాంచందర్ రావు.. సమ్మెకు వెళ్లే ముందు కార్మికులు నోటీస్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. నోటీస్ ఇచ్చిన తర్వాత కనీసం ఆరు వారాలు ఆర్టీసీ నిర్ణయం కోసం ఎదురు చూడాలని వాదించారు. ప్రభుత్వం కమిటీ వేయడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. స్పందించిన న్యాయస్థానం సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించే హక్కు ఎవరికి ఉందని అదనపు ఏజీని ప్రశ్నించింది. సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

ఆర్టీసీ ఎండీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని ఐకాస ఆర్టీసీ ఐకాస తరఫు న్యాయవాది ప్రకాష్‌రెడ్డి వాదించారు. కార్మికులు సమ్మెను విరమించి విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కోర్టుకు తెలిపారు. వారందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్మికుల గురించి కార్మికశాఖ న్యాయస్థానం చూసుకుంటుందని హైకోర్టు తెలిపింది. దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది.