ఆ ఊర్లో ఫ్రీగా మినరల్ వాటర్ ఇచ్చినా తాగరు
Timeline Viral

ఆ ఊర్లో ఫ్రీగా మినరల్ వాటర్ ఇచ్చినా తాగరు

అక్కడి జనానికి మినరల్ వాటర్ అవసరం లేదు. ఫ్రీగా ఇచ్చినా కూడా తాగరు . కొండ ప్రాంతం నుంచి జాలువారుతూ వచ్చే నీరంటేనే వారికి ఇష్టం . ఎన్ని ఇబ్బందులు పడైనా సరే ఆ నీటినే తెచ్చుకొని తాగుతారు. ఉదయగిరి లోని దుర్గం కొండ నుండి వచ్చే నీటికి ఎంతో డిమాండ్ ఉంది. ఈ నీరు సర్వరోగ నివారిణిలా పనిచేస్తుంది అని స్థానికుల నమ్మకం. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో ఎత్తైన కొండపై చారిత్రాత్మక కట్టడం దుర్గం కొండ ఉంది. అక్కడ నుంచి ప్రవహించే ఓ చిన్న నీటిధార ఇక్కడ ఎంతో ఫేమస్. ఈ నీటిని కోన నీళ్లు అంటారు. ఈ నీరు కాలువల ద్వారా ఉదయగిరి వరకు వెళుతుంది. ఈ నీటిధార చాలా పురాతనమైంది . ఎన్నో చెట్లను తాకుతూ కొండల సందులో నుంచి జాలువారుతూ కిందకు వస్తుంది ఈ నీరు. అందుకే ఈ నీటిని ప్రకృతి సంజీవనిగా భావిస్తారు స్థానికులు. నీటిని అమృతం గా భావించి తాగుతారు. ఉద్యోగస్తులు ఊరివాళ్లు అనే తేడానే లేదు. రోజు అందరూ వాటర్ క్యాన్స్ బిందెల్లో ఈ నీటిని తీసుకెళ్తు ఉంటారు. శతాబ్దాలుగా వాసుల దాహార్తిని తీరుస్తోంది ఈ నీటి ధార. గత కొన్ని ఏళ్లుగా దాని నుంచి నీరు రావడం కాస్త తగ్గింది. మళ్లీ ఈ మధ్య కురిసిన వర్షాలకు ధార పుష్కలంగా ప్రవహిస్తోంది ఈ నీటిని తాగితే ఎలాంటి వ్యాధుల బారిన పడము అని ఇక్కడి వారి నమ్మకం. ఉదయగిరి కొండను సంజీవని కొండ గా పిలుస్తారు . ఎన్నో ఔషధాల తయారీకి ఉపయోగించే మొక్కలు ఈ కొండ పై ఉన్నాయి. ఔషధ గుణాలు ఉండే మొక్కలు తాకుతూ నీరు కిందకు వస్తుంది. ఈ నీళ్లు ఎంతో రుచిగా ఉంటాయి. ఫ్రిజ్లో ఉంచినట్టుగా చల్లగా ఉంటాయట. ఇక ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము , రోగాలు దరికి రావు అంటున్నారు. అంటున్నారు స్థానికులు. బ్రిటిష్ కాలం నుండి ఈ దార ప్రవహిస్తూ ఉంది . ఇలా కొండపై నుంచి జాలువారి నీరు సన్నని కాలువ ద్వారా ప్రవహించి తొట్టెలో కి చేరుకుంటోంది. అక్కడి నుంచి మరో కాలువ ద్వారా ఉదయగిరి లోకి ప్రవేశిస్తుంది. ప్రభుత్వం మంచి నీటికోసం అనేక ఏర్పాటుచేసిన ఇక్కడి వారు మాత్రం కొండ పై నుంచి వచ్చే నీటిని తీసుకెళ్లి తాగుతున్నారు. వర్షాలు తగ్గి గత కొన్ని ఏళ్లుగా కొండ మీద నుంచి వచ్చే నీరు కూడా తగ్గింది .అవసరం మేరకు నీరు దొరకని పరిస్థితి. పాతతరం వారు మాత్రం ఎన్ని ప్రయాసలు పడినా సరే కొండపైకి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు . నీటితో వర్షాలు పుష్కలంగా పడడంతో మళ్ళీ ఉదయగిరి దుర్గం పై జలాలు సమృద్ధిగా పెరిగాయి . ఈ నీటిని పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఉదయగిరికి వచ్చిన కలెక్టర్ చక్రధర బాబు, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దీనిని సందర్శించారు . ఆ నీటిని తాగి వారు కూడా ఆశ్చర్యపోయారు. దుర్గం కొండ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.

సోర్స్ : NTV Telugu

Leave a Reply

Your email address will not be published.