మంటల్లో కాలిపోయిన మంత్రి ఇల్లు
Timeline

మంటల్లో కాలిపోయిన మంత్రి ఇల్లు

జమ్ముకశ్మీర్​ మాజీ మంత్రి, అప్నీ పార్టీ ఉపాధ్యక్షుడు అజాజ్ చౌధరీ​​ నివాసంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎగసి పడుతున్న మంటలను గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇంటి నుంచి బయటికొచ్చి తమ ప్రాణాలను కాపాడుకోగలిగారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

అయితే ఈ ఘటనలో సుమారు రూ.రెండు కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన రాంబన్​​​ జిల్లా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.