Breaking News :

ఎన్ కౌంటర్ పై రేపే విచారణ

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ చేస్తున్న NHRC బృందం సభ్యులు నాలుగోరోజు మంగళవారం విచారించింది. ఎన్ కౌంటర్ లో పాల్గోన్న పోలీసులు NHRC సభ్యులు ప్రశ్నించారు. నిందితులు తమపై దాడి చేసిన విధానాన్ని పోలీసులు వివరించారు. పోలీసులకు తగిలిన గాయాలపై NHRC బృందం వైద్యులను అడిగి వివరాలు తీసుకుంది. దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఢిల్లీకి వెళ్లి.. సుప్రీం కోర్టు విచారణకు హాజరై ఎన్ కౌంటర్ కు దారితీసిన పరిస్ధితులు వివరించనున్నారు. ఎన్ కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆరోజు పరిస్ధితులు ఏమిటి అనే విషయాలను సజ్జనార్ కోర్టుకు వివరిస్తారు.

Read Previous

‘ఛాపాక్‌’ ట్రైలర్ విడుదల

Read Next

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: పోలీసులకు ముచ్చెమటలు