కరోనా: హైదరాబాద్ లో డేంజర్ జోన్లు ఇవే
Timeline

కరోనా: హైదరాబాద్ లో డేంజర్ జోన్లు ఇవే

తెలంగాణ‌లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది.. ముఖ్యంగా ఆది నుంచి క‌రోనా కేసుల‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న హైద‌రాబాద్‌లో మాయ‌దారి వైర‌స్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది.. గ‌త రెండు మూడు రోజులుగా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం ప‌ట్టినా.. కేసుల తీవ్ర‌త అదేస్ధాయిలో ఉంది.

ఏ రోజు క‌రోనా హెల్త్ బులెటిన్ తీసుకున్నా.. పాజిటివ్ కేసుల్లో అగ్ర‌భాగం హైద‌రాబాదే.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో.. రోజుకో కొత్త రికార్డు త‌ర‌హాలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తేనే ఉన్నాయి.

అయితే.. హైద‌రాబాద్‌లో అత్య‌ధిక కేసులు న‌మోద‌వుతోన్న ప్రాంతాల‌ను హైరిస్క్ జోన్లుగా ప్ర‌క‌టించింది తెలంగాణ ప్ర‌భుత్వం.. యూస‌ఫ్‌గూడ‌, అంబ‌ర్‌పేట్‌, మెహిదీప‌ట్నం, కార్వాన్‌, చంద్రాయ‌న గుట్ట‌, చార్మినార్‌, రాజేంద్ర న‌గ‌ర్‌, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో 500కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు ఉండ‌డంతో.. హైరిస్క్ జోన్లుగా ప్ర‌క‌టిస్తున్న‌ట్టు పేర్కొంది స‌ర్కార్‌.

అంటే.. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండేవాళ్లు మ‌రింత జాగ్ర‌త్త‌గా మెసులుకోవాల్సి ఉంటుంది. మ‌రి ఆ ప్రాంతాల్లో ప్ర‌భుత్వం ఎలాంటి నిబంధ‌న‌లు విధిస్తుంది అనే విష‌యం తెలియాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published.