ఇంట్లో హిజ్రాల లొల్లి..అర్ద నగ్న ప్రదర్శన అంటూ… సహనం కోల్పోయిన యజమాని
Timeline

ఇంట్లో హిజ్రాల లొల్లి..అర్ద నగ్న ప్రదర్శన అంటూ… సహనం కోల్పోయిన యజమాని

ఈరోజుల్లో మగ , ఆడ తో పాటుగా హిజ్రాలకు కూడా సమాన హక్కులు కల్పించింది ప్రభుత్వం. దానితో హిజ్రాలలో కొందరు ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు లాయర్లు అయ్యారు, నటులు అయ్యారు , పోలీసులు అయ్యారు .. ఇలా ఎన్నో వృత్తుల్లో తమ ప్రతిభతో ఎదుగుదల చూస్తున్నార. అంతే కాకుండా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే వీరిలో కొందరు మాత్రం ఇంకా పాత పద్దతిలోనే ఈజీ మనీకి అలవాటుపడి , సామాన్య ప్రజల దృష్టిలో గౌరవం కోల్పోతున్నారు. రైలు ప్రయాణాల్లో , బస్సు స్టాపుల్లో , షాపింగ్ కాంప్లెక్సుల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ డబ్బుల కోసం సామాన్య ప్రజలను బాయ భ్రాంతులకు గురి చేసి చిరాకు పుట్టిస్తున్నారు. ఇది చట్ట రీత్యా నేరం కూడా. అయినా వారితో గొడవెందుకు అని చాలా మంది వెల్లకి తగ్గుతున్నారు వారిని నిలదీయడానికి.

అయితే హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనే జరిగింది. హైదరాబాద్ నగరంలోని ప్రగతి నగర్‌లో వ్రతం చేసుకుంటున్న ఓ ఇంట్లో హిజ్రాలు ఎంట్రీ ఇచ్చారు . అడిగినంత ఇవ్వకపోవడంతో అర్ధనగ్న ప్రదర్శన చేస్తాం అని బెదిరించి రూ.16,500 బలవంతంగా తీసుకెళ్లారు. కోపం కట్టలు తెంచుకున్న యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో , రంగ ప్రవేశం చేసిన పోలీసులు 10 మంది హిజ్రాలను అరెస్టు చేశారు.వారి నుంచి 7 సెల్‌ఫోన్లు, రూ.16,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఎప్పుడైనా మిమ్మల్ని హిజ్రాలు ఎక్కడ పడితే అక్కడ డబ్బుల కోసం వేధించిన వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి తక్షణమే 100 కి కాల్ చేయండి అని సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్లో ప్రజలకు తెలిపారు

Leave a Reply

Your email address will not be published.