Breaking News :

అసలు స్టోరీ: హైదరాబాద్ పోలీసులపై వలస కార్మికుల దాడి…

భవన నిర్మాణ పనుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్ – సంగారెడ్డి జాతీయ రహదారిలోని కంది వద్ద ఐఐటీ భవనాల నిర్మాణ పనుల్లోనూ పలువురు కార్మికులు పాల్గొంటున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు నిలిచిపోవడంతో కార్మికులందరికీ ఐఐటీ భవనం సమీపంలో తాత్కాలికంగా వసతి కల్పించారు. మొత్తం 2500 మంది కార్మికులకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు.

ఎస్పీఎల్ వర్గానికి చెందిన కార్మికులు 1700 మంది, ఎల్‌ఎన్‌టీ వర్గానికి చెందిన 800 మంది కార్మికులు ఐఐటీ భవనం వద్ద ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నెల రోజులుగా పనులు నిలిచిపోవడం, ఆదాయం లేకపోవడంతో తీవ్ర అసహనానినికి గురయ్యారు. కొద్ది రోజులుగా తమను స్వస్థలాలకు పంపాలంటూ ఆందోళన చేస్తున్నారు. బుధవారం (ఏప్రిల్ 29) ఉదయం వీరి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. అక్కడి పోలీసు సిబ్బంది అప్రమత్తమవడంతో వాహనాలను ధ్వంసం చేశారు.

పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. పెద్ద పెద్ద రాళ్లతో పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ, హైదరాబాద్ భవనం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

దాడిలో ఓ ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. భారీ పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్న సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కలెక్టర్ కూడా వారితో మాట్లాడి నచ్చజెప్పారు. ఊర్లకు పంపడం కుదరదని ఇక్కడే పని చేసుకోమని చెప్పారు. వారికీ కావలసినవన్నీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా ఆవేశంలో కార్మికులు చేసిన దాడి ని మన్నించి ఎటువంటి కేసులు నమోదు చేయలేదని వివరించారు.

అయితే ఈ వార్తను చాల రిపోర్టర్లు కార్మికులకు వస్తులు లేవని, ఆహారం లేదని అందుకే ఆగ్రహంతో దాడి చేసారని ప్రచారం చేస్తున్నారు. అందులో ఎటువంటి నిజం లేదు. వారిని అక్కడికొచ్చిన పోలీసులు మందలించి అన్నీ ఆరా తీయగా వాళ్ళు కేవలం చెప్పింది మమ్మల్ని మా ఊరికి పంపండి , మాకు భయంగా ఉంది అని చెప్పారని పోలీసులు , కలెక్టర్ చెప్తున్నారు.

వారికీ ప్రభుత్వం నుండి , పోలీసుల నుండి అన్ని సౌకర్యాలు అందుతూనే ఉన్నాయి.

Read Previous

కరోనా కష్టంలో సీతక్క సేవకు పురస్కారం

Read Next

ఏపీలో లాక్ డౌన్ రూల్స్ సడలింపు