spot_imgspot_img

Hyderabad Rains : తెలంగాణకు రానున్న కేంద్ర బృందం

గత రెండు వారాలుగా హైదరాబాద్ ను ఎడతెరిపి లేకుండా కారణంగా హైదరాబాద్ వాసులు అష్ట కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారులు రేయింబవళ్లు ప్రజల బాగోగులు చూసుకోవడానికి కష్టపడుతున్నారు. దీనిపై సీఎం కెసిఆర్ కూడా సమీక్ష చేసి వరదల వల్ల నష్టపోయిన వారికీ నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.

దీనిపై గత వారం ప్రధాన మంత్రి మోడీ కూడా ఆరా తీసి రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. జీహెచ్ఎంసీ అధికారులు వరద నష్టం కోట్లలోనే అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వ తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు కేటాయించింది.

ఇప్పుడు ఇక్కడి పరిస్థితులను తెలుసుకొని రిపోర్ట్ చేయడానికి కేంద్ర బృందం హైదరాబాద్ కు రానుంది. వారు రెండు రోజులపాటు పర్యటించి ఇక్కడి పరిస్థితులను, జరిగిన ఆర్థిక నష్టాలను కేంద్రానికి తెలియజేస్తారని సమాచారం.

Related Articles

Get in Touch

18,128FansLike
3,028FollowersFollow
0SubscribersSubscribe

Latest Posts