బ్రేకింగ్: ఆన్లైన్ క్లాసులు అర్ధం కావట్లేదని ఆత్మహత్య
Timeline

బ్రేకింగ్: ఆన్లైన్ క్లాసులు అర్ధం కావట్లేదని ఆత్మహత్య

కరోనా కారణంగా పాఠశాలలు , కాలేజీలు ప్రపంచ వ్యాప్తంగా మూసివేసిన విషయం తెలిసిందే. అయితే పిల్లలకు ఆన్లైన్ బోధన చేపట్టే పనుల్లో పడ్డాయి సంస్థలు. ప్రభుత్వాలు వీటికి అధికారికంగా ఎటువంటి గైడ్లైన్స్ ఇవ్వకపోయినా సరే విద్య సంస్థలు అన్ని సన్నాహాలు చేసేసి పట్టన ప్రాంతాల్లో ఉన్న కొన్ని పాఠశాలలు కాలేజీలు ప్రతీ విద్యా సంవత్సరం లాగే బోధనా మొదలుపెట్టాయి.

కొన్ని ప్రాంతాల్లో పిల్లలకు ఇంటర్నెట్ సౌకర్యం లేక, సరైన గాడ్జెట్స్ లేక ఇబ్బందుల్లో పడుతున్నారు. పిల్లలే కాదు పిల్లలకు ఆన్లైన్ పాటలు వినడం పనులు వదులుకొని మరీ తల్లి తండ్రులు వారి పక్కనే కూర్చొని పర్యవేక్షిస్తున్నారు

అయితే ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ కి చెందిన బోయినపల్లి లోని కంసారి బజార్ లోని ఇంటర్ విద్యార్థి యశ్వంత్ ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఆన్లైన్ క్లాసులు అర్ధం కావట్లేదని సూసైడ్ నోట్ రాసి , ఇంట్లోనే ఉరేసుకొని యశ్వంత్ చనిపోయాడు.

సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.