కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ కన్ఫార్మ్
Timeline

కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ కన్ఫార్మ్

నవ్యాంధ్ర రాజధానిపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా ఈ అంశంపై పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. ఈ క్రమంలో మాజీ ఎంపీ చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజధాని చిత్తూరు కావడం ఖాయమని చెప్పారు. అమరావతిని వదిలి సీఎం జగన్ బయటకు రావాలని సూచించారు. మహారాష్ట్ర ఎన్నికల అనంతరం హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కేంద్ర ప్రణాళికలు సిద్ధం చేస్తోందని బాంబు పేల్చారు. తిరుపతిని ఏపీ రాజధాని చేయాలని గతంలో ఆయన డిమాండ్ చేశారు.

రాజధాని అంశంపై సీఎం జగన్ క్లారిటీ ఇవ్వాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా అమరావతి రాజధానిని జగన్ ప్రభుత్వం తరలిస్తుందనే ప్రచారం జరుగుతోంది. కృష్ణా నదిలో వరద పోటెత్తడంతో రాజధాని అంశం తెరపైకి వచ్చింది. మంత్రి బోత్స పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజధానికి ముంపు ప్రమాదం ఉందని చెబుతున్నారు. తాజాగా మాజీ ఎంపీ చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.