జైలు పరిసరాల్లో భారీ బందోబస్తు

21

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులను పోలీసు కస్టడీపై షాద్ నగర్ కోర్టు నేడు నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో… చర్లపల్లి జైలు దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించే అవకాశం ఉండటంతో… పోలీసులు నిందితులను షాద్ నగర్‌కు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. జైలు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ విధించారు. ఎలాంటి నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదని ప్రకటించారు.