ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక జనప్రియ కాలనీలోని ఫ్యామిలీ కేర్ సర్వీస్ సెంటర్ ఉద్యోగిని హేమలత హత్యకు గురైంది.
ADVERTISEMENT
ADVERTISEMENT
ఆమెను సహోద్యోగి వేంకటేశ్వరరావు హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి హేమలతపై వెంకటేశ్వరరావు లైంగికదాడి చేయబోగ ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆమె ఎవరితో అయినా చెప్తుందన్న భయంతో హేమలత మెడకు చున్నీ బిగించగా.. ఊపిరాడక ఆమె చనిపోయింది.
ఇది గమనించిన స్థానికులు వేంకటేశ్వరరావును పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్నీ పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.