Breaking News :

కరోనా: కేటీఆర్ గారు గాంధీ హాస్పిటల్ లో నా భర్త మిస్సింగ్..

రోజు రోజుకి తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. టెస్టులు కూడా ఎక్కువగా చేయడం లేదని అటు ప్రతి పక్షాలు, సోషల్ మీడియా లో నెటిజన్లు విమర్శలు చేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే ట్విట్టర్ లో ఒక మహిళా తన ఆవేదనను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & ఐటీ మంత్రి కేటీఆర్ కి తన బాధను తెలియజేస్తూ కొన్ని ట్వీట్లు చేసింది. ఇపుడు ఆ ట్వీట్లు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఆలంపల్లి మాధవి అనే మహిళా కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ, తన పేరు మాధవి, తన భర్త పేరు మధు సూధన్ వనస్థలిపురం లో తన ఇద్దరు కూతుర్లతో నివసిస్తున్నాం అని తెలిపింది. కరోనా సోకిన కారణంగా కుటుంబంలోని అందరు వైఖరులు గాంధీలో అడ్మిట్ అయ్యామని, ఆ తరువాత తిరిగి ఇంటికి కూడా వచ్చాం అని కానీ తన భర్త మాత్రం రాలేదని తెలిపింది.

ఏప్రిల్ 27 న కింగ్ కోటి హాస్పిటల్ లో జాయిన్ అయిన తన భర్తను మే 30 న గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లారని, మే 1 నాడు అయన చనిపోయాడని, మే 2 నాడు అంత్యక్రియలు కూడా చేసేశారని . ఇదంతా వారి అనుమతి తీసుకోకుండానే జరిగిందని ,ఆధారాలు అడిగితే మృత దేహం కూడా చూయించలేదని ఆవిడ తెలిపింది.

ఆధారాలు అడిగితే , వీడియో ప్రూఫ్ కానీ, అయన బడికి సంబదించిన రుజువులు కానీ, వస్తువులు కానీ ఏవీ కూడా ఇవ్వలేదని అడిగితే స్పందించట్లేదని తెలిపింది.

నేను గాంధీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే సమయానికి అంటే మే 16 నాడు తిరిగి నా కుటుంబ సభ్యులు నా భర్త గురించి అడిగితే తాను వెంటిలేటర్ పై ఉన్నారని అధికారులు చెప్పారని తెలిపింది.

ఒకసారి బ్రతికే ఉన్నాడని , మరొక సరి చనిపోయారని ఇలా చేపట్టు నా భర్త జాడ నాకు తెలియకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ నా భర్త మిస్సింగ్ కేసుని మీరే ఎలాగైనా తేల్చాలి అని ఆవిడా కోరింది. దీనికి ఇపుడు సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం సపోర్ట్ చేస్తూ తెలంగాణ పోలీసులను ఆవిడకు న్యాయం చేయాలనీ కోరుతున్నారు. మరి దీనిపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

FACT CHECK UPDATE

ఆవిడ తెలిపినట్టుగా , మే 3 న తన భర్త చనిపోయినట్టు న్యూస్ పేపర్లో కూడా కథనం ప్రచురితమైంది. అంతే కాకుండా దహనం కూడా చేశారని ఆ న్యూస్ లో ఉంది.

ఫాక్ట్ చెక్ వివరాలు ఈ అకౌంట్ నుండి తీసుకోవడం జరిగింది

Read Previous

కెసిఆర్ ప్రెస్ మీట్: ఇంతకీ ఈ రాహుల్ ఎవరు?

Read Next

అసలు నిజం: భర్త మిస్సింగ్ అంటూ కేటీఆర్ కి ట్వీట్, స్పందించిన గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్