Breaking News :

వారెవ్వా.. రోహిత్

హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌ లేపాడు. తన కెరీర్ లో న్యూ బెస్ట్ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు రోహిత్. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి టాప్‌ 10లో చోటు దక్కించుకున్నాడు. సఫారీతో జరిగిని చివరి టెస్టుకు ముందు 22వ స్థానంలో ఉన్న రోహిత్‌.. రాంచీ టెస్టులో డబుల్‌ సెంచరీ సాధించడంతో అతడి గ్రాఫ్‌ ఒక్కసారిగా మారిపోయింది. 722 పాయింట్లతో పదో స్థానానికి చేరుకున్నాడు.

ఇక ఐసీసీ అన్ని ఫార్మట్లలో టాప్‌ 10లో నిలిచిన రెండో బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ మరో రికార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు సారథి విరాట్‌ కోహ్లి మాత్రమే మూడు ఫార్మట్లలో టాప్‌-10 స్థానంలో కొనసాగుతున్నాడు.

Read Previous

డెంగీపై.. ప్రభుత్వ బెండ్ తీసిన హైకోర్టు

Read Next

50 రోజుల తర్వాత.. బెయిల్