Breaking News :

ఇది అరుదైన బహుమతి

విరాట్‌ కోహ్లి, బాలీవుడ్ తార అనుష్క శర్మకు 2017, డిసెంబర్‌ 11న వివాహం జరిగింది. నిన్న మ్యాచ్ ముగిశాక వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ తో మాట్లాడుతూ తన వెడ్డింగ్‌ యానివర్సరీ గురించి కోహ్లీ ప్రస్తావించాడు.ఇది తనకు చాలా ప్రత్యేక ఇన్నింగ్స్‌ అని చెప్పాడు. డిసెంబరు 11న రెండో వెడ్డింగ్‌ యానివర్సరీ జరుపుకుంటున్నామని, ఈ ఇన్నింగ్స్‌ తన భార్య అనుష్కకు తానిచ్చే అరుదైన బహుమతని వ్యాఖ్యానించాడు. నిన్న జరిగిన నిర్ణయాత్మక టీ20లో వెస్టిండీస్‌పై భారత్‌ 67 పరుగుల తేడాతో విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ ప్రధాన పాత్ర పోషించాడు. 29 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లతో హోరెత్తించి 70 పరుగులు బాదాడు.

Read Previous

డికె అరుణ ఫిక్స్: తెలంగాణ బిజెపి అధ్యక్షురాలిగా డికె అరుణ?

Read Next

సాక్షి ఛానల్ పై వైసీపీ శ్రేణులు ఆవేదన