ఇండియా Vs చైనా: అమరులైన 20 మంది జవాన్లు
Timeline

ఇండియా Vs చైనా: అమరులైన 20 మంది జవాన్లు

india-china

గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది వరకు భారత సైనికులు మృతి చెందారని తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశమూ ఉందని సమాచారం. మరోవైపు గాయపడిన, చనిపోయిన చైనా జవాన్ల సంఖ్య 43 వరకు ఉండొచ్చని వార్తలొస్తున్నాయి. వార్తా సంస్థ ఏఎన్ఐ ఈ మేరకు వివరాలు వెల్లడించింది. అయితే పీటీఐ మాత్రం పది మంది అని చెబుతోంది.

సోమవారం రాత్రి తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సరిహద్దుల్లో  భారత్‌, చైనా బలగాలు బాహాబాహీకి దిగాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో కల్నల్‌ సహా 20 మంది అమరులయ్యారు. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published.