ADVERTISEMENT
ADVERTISEMENT
కశ్మీర్ లో శాంతియుత వాతావరణం దెబ్బతీసేందుకు పాక్ చేస్తున్న కుట్రలు మరోసారి వెలుగులోకి వచ్చింది. భారత సరిహద్దు ప్రాంతమైన కెరాన్ సెక్టార్ గుండా ప్రవేశించేందుకు పాక్ కమాండోలు విఫలయత్నం చేశాయి. పాకిస్తాన్ జెండాతో ఐదుగురు కమాండోలు భారత్ లోకి ప్రవేశిస్తుండగా ఈ దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి.
ఆగస్టు తొలి వారంలో కెరాన్ సెక్టార్ ద్వారా భారత్ లోకి చొరబాటుకు ఆ దేశ కమాండోలు యత్నిస్తుండగా.. అదే సమయంలో అప్రమత్తంగా ఉన్న భారత బలగాలు.. ఐదుగురు పాక్ కమాండోలను హతమార్చారు. దానికి సంబంధించిన వీడియోను భారత సైన్యం సోమవారం విడుదల చేసింది.