రైతుల కోసం అమెరికా డాక్టర్లు – ఎన్ని రోజులైనా సేవ చేస్తాం

యుఎస్ఎ నుండి 20 మంది భారతీయ వైద్యులతో కూడిన బృందం తిక్రీ సరిహద్దులో ఇక్కడ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు మూడు వారాలుగా నిరసన వ్యక్తం చేస్తున్న వారికీ వైద్య సేవలను అందించడానికి తిరిగి అమెరికా వెళ్లకుండా ఆగిపోయారు.

నేషనల్ మీడియా ఎన్డీటీవీ కథనం ప్రకారం , వారు ప్రతీ సంవత్సరం భారత్ లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని ఉచితంగా విఆద్యా సేవలు అందిస్తారని ఆ డాక్టర్ల బృందం లోని ఒక వైద్యుడు తెలిపాడు. వారు దాదాపు 20 రోజుల క్రితం తిక్రి వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారని, అప్పటి నుండి అనారోగ్య రైతులకు హాజరవుతున్నారని చెప్పారు. మేము మూడు నెలల క్రితం భారతదేశానికి వచ్చాము మరియు ఒక నెల వ్యవధిలో తిరిగి వెళ్లాల్సి ఉంది, కాని ఇంతలో రైతుల ధర్నా వలన , వారి కష్టం చూసి ఆడిపోయాము” అని ఆయన చెప్పారు.

భారతదేశంలోని వైద్యులు వారికి అన్ని రకాల వైద్య సామాగ్రితో సహాయం చేస్తున్నారు.గత నాలుగు సంవత్సరాలుగా యుఎస్‌ఎలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న మిస్టర్ సింగ్ ప్రకారం, వారు ప్రతిరోజూ కనీసం 1,500-2,000 మంది రోగులకు వైద్యం చేస్తున్నారు, మరియు నిరసనకారులను ఇబ్బంది పెట్టే అత్యంత సాధారణ అనారోగ్యం “ఒత్తిడి” అని ఆయన తెలిపారు.

కోవిద్ కారణంగా మాస్క్ ధరించమని చెప్పినా రైతులు అర్ధం చేసుకోవట్లేదు అని దానికి కారణం ఒకటి వారికీ అవగాహనా లేకపోవడం కొందరిలో అయితే మరి కొందరేమో మాస్క్ ధరిస్తే , కొందరు నేరస్థులు కూడా మాస్క్ లు ధరించి మా మధ్యలో తిరిగి మా ధర్నాకు భంగం చేకూర్చుతారేమో అన్న భయం కూడా అని ఆయన చెప్పారు.