షాకింగ్ : భారత్ లో రైతుల ధర్నా – అలర్ట్ గా ఉన్నాం అంటున్న పాకిస్తాన్
Timeline

షాకింగ్ : భారత్ లో రైతుల ధర్నా – అలర్ట్ గా ఉన్నాం అంటున్న పాకిస్తాన్

మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రైతు చట్టాలు రద్దు చేయాలనీ భారత్ లో పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఒక్క బీజేపీ తప్ప ఈ ధర్నాలు భారత్ లో ఉన్న అని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ఇప్పుడు. బిల్ పాస్ చేయడానికి ఒప్పుకున్న పార్టీలు కూడా ఇపుడు రైతులకు మద్దతు తెలుపుతున్నాయి.

అయితే ఈ రైతుల ధర్నా ఇపుడు బీజేపీకి పెద్ద తల నొప్పిగా మారిపోయింది. దీని నుండి ప్రజలను డైవర్ట్ చేయడానికి భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ వర్గాలు భావిస్తున్నట్టు , పాకిస్తాన్ ఆర్మీ కూడా, ఇండియా పాక్ బార్డర్ లో ఉన్న తమ ఆర్మీ కూడా అలర్ట్ గా ఉందని పాక్ సెక్యూరిటీ అధికారులు చెప్పినట్టు న్యూయార్క్ టైమ్స్ పాకిస్తాన్ కరెస్పాండెంట్ సలీమాన్ మసూద్ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. ఈయన చేసిన ట్వీట్లు ఇప్పుడు సంచలనంగా మారబోతున్నాయి .

Leave a Reply

Your email address will not be published.