సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన న్యూజిలాండ్ ఎంపీ
Timeline

సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన న్యూజిలాండ్ ఎంపీ

భారత సంతతి న్యూజిలాండ్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ గౌరవ్ శర్మ సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసారు. శర్మభారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ కు చెందినవాడు.

న్యూజిలాండ్‌లో పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన డాక్టర్ గౌరవ్ శర్మ, న్యూజిలాండ్ దేశీయ భాష అయిన మౌరీతో పాటు భారతదేశం నుండి వచ్చిన శాస్త్రీయ భాష అయిన సంస్కృతం లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రధాని జెసిండా ఆర్డెర్న్ నేతృత్వంలోని లేబర్ పార్టీ మరోసారి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున భారత సంతతి యువ వైద్యుడు గౌరవ్ శర్మ విజయం సాధించారు.

Leave a Reply

Your email address will not be published.