పబ్జీ బ్యాన్: పీడా పోయింది, ఆనందంలో తల్లి తండ్రులు
Timeline

పబ్జీ బ్యాన్: పీడా పోయింది, ఆనందంలో తల్లి తండ్రులు

సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్‌ మరోసారి షాక్‌ ఇచ్చింది. డ్రాగన్‌ దేశానికి చెందిన మరో 118 మొబైల్‌ యాప్‌లపై నిషేధం విధించింది. వీటిలో పబ్‌జీ, క్యామ్‌ కార్డ్‌, బైడు, కట్‌కట్‌ సహా మొత్తం 118 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

గతంలో గల్వాన్‌ లోయ వద్ద ఘర్షణల సమయంలో దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్‌టాక్‌ సహా అనేక యాప్‌లపై కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ నిషేధం విధిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయంతెలిసిందే. మళ్లీ తాజాగా ఉద్రిక్తతల నేపథ్యంలో మరికొన్ని చైనా యాప్‌లపై కేంద్రం వేటు వేసింది.

పబ్జీ, పబ్జీ లైట్‌ యాప్‌లను ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా వినియోగదారులు వాడుతున్నారు.

ఈ పబ్జీ బ్యాన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని తల్లి తండ్రులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. పబ్జీ ఆటకు అడిక్ట్ అయిపోయిన యువత తమ ప్రాణాలే కాదు , ఆడొద్దు అని చెప్పిన కుటుంబ సభ్యుల ప్రాణాలను సైతం పొట్టన పెట్టుకున్న కేసులు మనం చూస్తున్నాం. అంతే కాకుండా చదువు ను కూడా పక్కన పెట్టేసి కుర్రకారు పబ్జీ మోజులో బ్రతుకుతున్నారు. ఈ దెబ్బతో యువత ఆ మత్తులో నుండి బయటపడే అవకాశం ఉంటుందని, ఈ నిర్ణయం తీసుకున్న మోడీ కి కృతజ్ఞతలు అంటూ తల్లి తండ్రులు చెపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.