కరోనా సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం కుదరదు అని ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమీషన్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం రాజకీయ దుమారం లేపింది.
అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ రూల్స్ని అతిక్రమించకూడదనే కారణం చూపి సమర్ధించుకున్నారు. కానీ వైసీపీ మాత్రం నిమ్మగడ్డ కేవలం తనను 2016 లో అపాయింట్ చేసిన చంద్రబాబు నాయుడు కి లాభం చేకూర్చాలనే ఈ నిర్ణయం తీసుకున్నాడని, ఒకసారి చిత్తు చిత్తుగా ఓడిపోయిన టీడీపీకి ఇది మళ్ళీ ఒక పరాజయం కాకూడదనే ఇలా చేసారని ఆరోపించింది.
నిమ్మగడ్డ నిర్ణయం పై స్వయంగా జగన్ ప్రెస్ మీట్ పెట్టి నిమ్మగడ్డను ఏకిపారేశారు. కేవలం చంద్రబాబుకి , మీ వర్గం వారికీ లాభం చేయాలనే ఇలా చేశారు అంటూ ఆరోపణలు చేసారు. అక్కడి నుండి ఇది కుల రాజకీయం గా మారిపోయింది. దీనితో అందరు జగన్ భయంతోనే ఇలా చేసాడు , స్థానిక ఎన్నికల్లో ఓడిపోతే అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి గెలిచిందంతా పోతుంది అని ఇలా చేస్తున్నాడని విమర్శలు చేసారు.
కానీ నిజానికి అసలు జగన్ కి ఎన్నికలు వాయిదా వేయటంలో అస్సలు అభ్యంతరాలు లేవట. మరి అసలు గొడవ ఏంటనే కదా?
అంతే కాదు జగన్ తన క్యాడర్ కి అసలు స్థానిక ఎన్నికలు మనకు టార్గెట్కానే కాదు, ఇప్పుడు కావు 2024 లో కూడా ఇవి మనకు ఏ రకంగా ఉపయోగపడవు అని కుండబద్దలుకొట్టి చెప్పాడని సమాచారం. కానీ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ ప్రవర్తించిన తీరు హుందాగా లేదని, జగన్ ప్రభుత్వాన్ని కానీ, హెల్త్ మినిస్ట్రీని కానీ సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని జగన్ అభిప్రాయపడ్డారట.అంతే కాకుండా సెంట్రల్ కి ప్రొటెక్షన్ రిక్వెస్ట్ చేయడం అనేది జగన్ కి ఇంకా కోపం తెప్పించిందట.
కొందరు పార్టీ నేతలు జగన్ కి ఈ విషయాన్నీ పెట్టుకోవద్దని సలహా కూడా ఇచ్చారట.. అయినా జగన్ సుప్రీం కోర్టుకు వెళ్ళడానికే మొగ్గు చూపుతున్నారు.
అసలు స్టోరీ :
గతేడాది మేలో వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చినప్పుడు, 2016 లో తెలుగు దేశం పాలనలో చంద్రబాబు నాయుడు హయాంలో నియమించిన రమేష్ కుమార్‌ను భర్తీ చేయాలని నిర్ణయించింది. అప్పటి ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం రమేష్ కుమార్ ను రాజీనామా చేయమని కోరారట. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ నవంబర్ వరకు సమయం కోరారట.
2019 డిసెంబర్‌లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్‌ను కలుసుకుని, తాను కెరీర్ బ్యూరోక్రాట్‌గా ఉన్నానని, అధికారంలో ఉన్న మునుపటి పార్టీకి అనుకూలంగా పక్షపాతంతో వ్యవహరిస్తానని అనుకోవద్దని చెప్పారట.
దానికి జగన్ కూడా సరైన రీతిలోనె స్పందించి మీ పేరుకి విలువ ఇచ్చి మిమ్మల్ని తీసుకుంటున్నాను, ఇక మీరే ఎన్నికల అధికారిగా కంటిన్యూ అవొచ్చు, ఏ అభ్యన్తరం లేదని చెప్పడాన్ని సమాచారం.
అయితే అంత మంచిగా అవకాశం ఇచ్చిన జగన్ ని ఇలా ఏకపక్ష నిర్ణయంతో తన ప్రభుత్వాన్ని, అధికారులను అవమానించేలా ఏ సలహా తీసుకోకుండా నిర్ణయం తీసుకోవడం అనేది జగన్ జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే రేపు ఇంకో అధికారి ఇలానే చేయొచ్చు, అప్పుడు అధికారులకు సీఎం పై నమ్మకం, గౌరవం పోతాయని అందుకే జగన్ ఈ విషయాన్ని అంత ఈజీగా తీసుకోలేదనేది విశ్వసనీయ వర్గాలు చెప్తున్న మాట.