హిందూ సాంప్రదాయంలో గోత్రానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. మన ఇంట్లోకాని గుడిలో కానీ ఏదయినా ముఖ్యమైన కార్యక్రమాలలో మన గోత్రాన్ని ఒకసారి మననం చేసుకోవడం తప్పనిసరి. పూజా కైంకర్యాలలో మన గోత్రం, మన పేరు, మనం ఉండే ప్రదేశం ఒకసారి చెప్పుకొని మన పూర్వీకుల అనుమతితో నేను ఈ కార్యక్రమాన్ని చేయదలచాను అని సంకల్పం చేసుకుంటాం. ఆలా మననం చేసుకోవడం వల్ల వాళ్ళ ఆశీస్సులు మనకి అందుతాయని ఒక నమ్మకం.

అసలు ఈ గోత్రం అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడింది ? అనేది ఆలోచన చేస్తే, కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. కొందరి గోత్రాలు ఋషుల పేర్లు గాను, మరికొందరికి ఊరు పేరు గాను, మరికొందరికి వారి పూర్వీకుల వృత్తి ని తెలియచేసేవిగాను, మరికొందరికి వంశం యొక్క మూలపురుషుడి పేరు గాను ఉంటాయి.

ఉదాహరణకు గార్గేయ, పైడిపాల, ఇలా… కొంతమందికి ఇంటిపేరు మారినా గోత్రం ఒక్కటే ఉంటుంది మరికొందరికి ఇంటి పేరు ఒక్కటే అయినా గోత్రం వేరేలా ఉంటాయి. ఇవి సర్వసాధారణం. కొంతమందికి వారి గోత్రం ఏదో తెలీదు, అలాంటప్పుడు వాళ్ళు “కశ్యప” అనే గోత్రాన్ని వాడుకోవచ్చని మన ధర్మ శాస్త్రాలలో తెలియచేసారు.

పెళ్లిళ్ల విషయంలో మన పెద్దలు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలతో పాటుగా గోత్రాలు కూడా చూడమని చెప్తుంటారు, ఎందుకంటే దానిలో ఒక రహస్యం ఉంది. అలా ఒకే గోత్రం వాళ్ళని “సగోత్రీకులు” అని అంటారు. అంటే వాళ్ళు మనకి సోదర సహోదర సామానులు. వాళ్ళు మనకి సోదరులు వరుస అవుతారు కాబట్టి ఒకే గోత్రం ఉండకూడదు అనేది ఒక నిబంధన.

సైన్స్ పరంగా వారందరు ఒకే రకమైన జీన్స్ కలిగివుంటారని, ఒకవేళ పెళ్లిళ్లు చేసుకుంటే పుట్టే పిల్లలకు వైకల్యం, అర్ధాయుష్షు, దీర్ఘకాలిక వ్యాధులు అలాంటివి కలిగే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ ఒకే గోత్రం కనుక ఉండి వాళ్ల పూర్వీకులకు అసలు సంబంధం లేకపోతే , ఆ అమ్మాయిని వాళ్ళ మేనమామకు దత్తత ఇచ్చి అప్పుడు ఆ వరుడుకి ఇచ్చి వివాహం చేయించవచ్చు అని ఒక సడలింపు కల్పించారు.

Leave a Reply

Your email address will not be published.

GIPHY App Key not set. Please check settings