Breaking News :

మహిళారోబోతో ఇస్రో ప్రయోగం

ఇస్రో వచ్చే ఏడాది సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ఎప్పటి నుండో అంతరిక్షంలోకి భారతీయులను పంపేందుకు ఇస్రో యోచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో భాగంగా 2022లో గగన్ యాన్ మిషన్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను ఇస్రో అంతరిక్షంలోకి పంపబోతోంది. ఈ ముగ్గురు వ్యోమగాములను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఎంపిక చేశారు. వీరికి రష్యాలోని అంతరిక్ష కేంద్రంలో అవసరమైన శిక్షణను ఇవ్వనున్నారు. గగన్ యాన్ కు ఎంపికైన ముగ్గురు వ్యోమగాములు పురుషులే కావడం గమనార్హం. అయితే ఈ ముగ్గురి కంటే ఓ ముందుగా ఓ మహిళను ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది.

ఆమె పేరు ‘వ్యోమమిత్ర’. ఇది ఓ మహిళా హ్యూమనోయిడ్ రోబో కావడం విశేషం. మాన‌వ శ‌రీరంలో ఉన్న అవ‌య‌వాల ప‌నితీరును ప‌రీక్షించేందుకు ఇస్రో ఈ హాఫ్ హ్యుమ‌నాయిడ్‌ను పంప‌నున్న‌ట్లు ఇస్రో శాస్త్ర‌వేత్త శ్యామ్ ద‌యాల్ తెలిపారు. నింగిలోకి ఓ రోబోను పంపిస్తామ‌ని, దాని నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు రిపోర్ట్‌ను అందుకుంటామ‌న్నారు. ఇది కేవ‌లం ప్ర‌యోగాత్మ‌క ప‌ద్ధ‌తిలో చేస్తామ‌న్నారు. వ్యోమ‌మిత్ర మిమిక్రీ చేయ‌గ‌ల‌దు. మ‌నుషులతో సంభాషించ‌గ‌ల‌దు. బెంగుళూరులో జ‌రిగిన మీడియా స‌మావేశంలో వ్యోమ‌మిత్ర‌ను జ‌ర్న‌లిస్టుల‌కు ప‌రిచ‌యం చేశారు.

Read Previous

ఢిల్లీ వెళ్లి డమ్మీ అయిన పీకే..

Read Next

న్యూజిలాండ్‌ లో టీమిండియా