Breaking News :

ఐటీ దాడులు: అజ్ఞాతంలో కల్కిభగవాన్‌ దంపతులు

మరోవైపు వారికి తమకు చెందిన ఆశ్రమాలు, వ్యాపార సంస్థలపై మూడు రోజులుగా ఆదాయం పన్ను (ఐటీ) అధికారుల దాడులు కొనసాగిస్తుండగా కల్కిభగవాన్‌ దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లారు. దక్షిణాది రాష్ట్రాలలో 40 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. హైదరాబాద్‌లోని స్ట్టూడియో ఎన్‌ కార్యాలయంతోపాటు డబ్ల్యూఎల్‌ స్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఫిల్మ్‌నగర్‌లోని కల్కిభగవాన్‌ కుమారుడు కృష్ణకు చెందిన ఆస్తులతోపాటు, ఆయన వ్యాపార భాగస్వాములపై కూడా ఐటీ దాడులు జరిగాయి.

స్థానిక ఐటీ అధికారుల సహకారంతో చెన్నైకి చెందిన అధికారుల బృందం ఈ సోదాలు నిర్వహించింది. మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్న స్ట్టూడియో ఎన్‌ చానల్‌ను నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ మామ నార్నే శ్రీనివాసరావు నుంచి 2014లో కల్కి భగవాన్‌ కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ఈ సంస్థలో తనిఖీలు చేశారు.

కల్కిభగవాన్‌ ఆశ్రమం ఐదెకరాల నుంచి ప్రారంభమై వేలాది ఎకరాలకు విస్తరించింది. ఆశ్రమంలో దాదాపు 1500 మందికిపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి ఏటా సిబ్బందికి జీతభత్యాలు చెల్లిస్తూ క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తూ, ఐటీ రిటర్న్‌ దాఖలు చేస్తున్న కల్కిభగవాన్‌ గత మూడేండ్లుగా పన్నులు చెల్లించడం లేదని, ఐటీ రిటర్న్స్‌ కూడా దాఖలు చేయడం లేదని సమాచారం. అలాగే సంస్థలకు ఉన్న కల్కి పేరును కూడా మార్చారు.

ఏకం’తో పాటు పలురకాల కంపెనీలు, ట్రస్టీల పేర్లతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు కల్కి ఆశ్రమంపై నిఘా పెట్టారు. చెన్నైలోని ప్రధాన కార్యాలయంతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుబంధ ఆశ్రమాలు, కార్యాలయాలు, భూముల కొనుగోళ్లు, విరాళాల సేకరణలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది.

చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని కల్కిభగవాన్‌కు చెందిన ప్రధాన ఆశ్రమం తమిళనాడు పోలీసుల పహారాలో ఉన్నది. అజ్ఞాతంలోకి వెళ్లిన కల్కిభగవాన్‌, ఆయన భార్య పద్మావతి మూడో రోజుకూడా బయటకు రాలేదు. చెన్నైలోని నుంగంబాకం ప్రధాన కార్యాలయంలో కల్కిభగవాన్‌ కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు.

Read Previous

ఆర్టీసీ సమ్మె: గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు

Read Next

ఆర్టీసీ సమ్మె: అశ్వత్థామరెడ్డి అరెస్ట్