Breaking News :

వైజాగ్ ప్రజలపై యాంకర్ రష్మీ ఆగ్రహం

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా భయంకరమైన కరోనా వైరస్ కారణంగా భయాందోళనకు గురవుతున్న తరుణంలో, అప్రమత్తమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని విధించిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఇవేమి పట్టించుకోని కొందరుప్రజలు మాత్రం తమ ఇష్టారీతిలో బయట తిరుగుతూ ప్రజలను ఇంకా భయాందోళనకు గురి చేస్తున్నారు. కానీ కొందరు విశాఖ యువకులు, ప్రజలు మాత్రం తమ ఇష్టారీతిలో వ్యవహరిస్తూ, రోడ్లపై తిరుగుతున్నారని, వారి వల్ల వారి కుటుంబాలు కూడా ఈ వైరస్ భారిన పడే అవకాశం ఉందని, అందుకనే అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని రష్మీ హెచ్చరించారు. అంతేకాకుండా రోజురోజుకు ఈ కరోనా వైరస్ భయంకరంగా వ్యాపిస్తున్న కారణంగా, నిత్యం ఎన్నో పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ కూడా కొందరిలో ఇంతవరకు కూడా అవగాహన రాకపోవడం అనేది చాలా బాధాకరమని రష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు.Ad

కాగా మన ప్రజలందరి భవిష్యత్తుతో పాటు, మన భావితరాలు కూడా బాగుండాలనే నేపథ్యంలో ఏర్పాటు చేసిన అంశం లాక్ డౌన్ అని, దీన్ని ఎవరు కూడా శిక్ష లాగ భావించొద్దని, ఇది ప్రభుత్వం మనపై తీసుకుంటున్న జాగ్రత్తలని వెల్లడించారు. ఈ విషయంలో మనం కొంత నిర్లక్ష్యాన్ని చూపినా కూడా మన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అందుకనే అందరు జాగ్రత్తగా ఉండాలని యాంకర్ రష్మీ వెల్లడించారు. ఈ మేరకు ప్రజల కోసం పని చేస్తున్న పోలీసులు, మీడియా, ప్రభుత్వాధికారులు, సిబ్బందికి ప్రజలందరూ కూడా సహకరించాలని తెలిపారు.

Read Previous

కరోనా ఎఫెక్ట్ : చదువు ఆన్ లైన్ లోనే చెప్పేస్తున్న “నారాయణ”

Read Next

ఏప్రిల్ 14- ఆ తరువాత స్టెప్ బై స్టెప్ లాక్ డౌన్ ఎత్తివేత