spot_imgspot_img

మహిళ: తండ్రి కొనిచ్చిన ఫోన్ కోసం దొంగలను చితకబాదిన యువతి

ఒకప్పుడు చేతిలో ఫోన్లు ఉంటె తల్లి తండ్రులు కోప్పడేవారు. కానీ ఇప్పుడు తల్లి తండ్రులే సెల్ ఫోన్ కొనిచ్చి మరీ చేతిలో పెడుతున్నారు. కరోనా చేసిన పనే ఇది కూడా. కరోనా కారణంగా పాఠశాలలు మూతబడ్డాయి దీంతో ఆన్లైన్ క్లాసులకు తెరలేపాయి విద్య సంస్థలు.

జలంధర్‌ పట్టణంలోని ఫతేపురి మొహల్లాకు చెందిన కుసుమ్ ‌కుమారి ట్యూషన్‌ నుండి ఇంటికి వెళ్తుంది. అలా ఫోన్‌ పట్టుకుని రోడ్డుపై వెళ్తున్న కుసుమ్ ను ఇద్దరు దుండగులు బైక్‌పై ఫాలో అవుతూ వచ్చారు. ఆమె చేతిలో ఉన్న ఫోన్‌ లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించారు. కుసుమ్ ప్లేస్ లో ఎవరున్నా షాక్ కి గురై పక్కన వాళ్ళను సాయం కోసం పిలుస్తారు. కానీ కుసుమ్ అలా చేయలేదు. దుండగులు ఫోన్ లాక్కుంటున్నారు అని గ్రహించిన మరుక్షణమే 15 ఏళ్ళ కుసుమ్ వీర మహిళగా మారింది. ఫోన్‌ తీసుకుని బైక్‌ ఎక్కబోతున్న దొంగను గట్టిగా పట్టుకుంది. వాడు కూడా కుసుమ్ జడ పట్టుకొని బలంగా కొట్టేసాడు. వాడు పదునైన కత్తితో కుసుమ్ చేతి మీద గట్టిగా ఒక దెబ్బ వేసాడు. అయినా కుసుమ్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు‌. వాడి టీ షర్ట్‌ కాలర్‌ను గట్టిగా పట్టుకుని పారిపోనివ్వకుండా వెనక్కి లాగేసింది. ఇంతలో పక్కనే ఉన్న కొందరు అక్కడికి రావడంతో బైక్‌ డ్రైవ్ చేస్తున్న మరో దొంగ వెధవ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే దొరికిన దొంగను మాత్రం ఆ బాలికతో పాటు స్థానికులు చితకబాదారు. ఆ తరువాత పోలీసులకు అప్పగించారు.

కుసుమ్ చేసిన వీరోచిత సాహసం అంతా సీసీటీవీ లో రికార్డ్ అయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇపుడు వైరల్. అంతే కాదు కుసుమ్ అందరి చేత ప్రశంసలు పొందుతుంది. తన తండ్రి తనకు ఫోన్ కొనివ్వడం కోసం ఎంతో కష్టపడ్డారు అని అలాంటి ఫోన్ ఒక్కసారిగా చేతిలోనుండి చేజారిపోతుంటే ప్రాణం పోయినంత పనైందని కుసుమ్ చెప్పింది. నా చదువు కోసం నాన్న పడ్డ కష్టం వృధా అవ్వకూడదు అనే ఆ ధైర్యం చేశాను అని తెలిపింది.

దొంగ చేతిలో గాయపడ్డ కుసుమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.  కుసుమ్‌ ధైర్యసాహసాలను మెచ్చుకున్న ఆస్పత్రి యాజమాన్యం ఆమెకు ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయించుకుంది. ఆమె పేరును జాతీయ, రాష్ట్ర స్థాయి సాహస అవార్డులకు పంపిస్తామని జలంధర్‌ పోలీస్‌ కమిషనర్‌ గుర్‌ప్రీత్ సింగ్‌ భుల్లర్‌ ప్రకటించారు. అదేవిధంగా ఆమె ధైర్యసాహసాలకు గుర్తింపుగా రూ. 51 వేల క్యాష్‌ రివార్డును అందజేస్తున్నట్లు జలంధర్‌ సిటీ డిప్యూటీ కమిషనర్‌ ఘన్‌శ్యామ్ తోరీ తెలిపారు.

Related Articles

Get in Touch

18,128FansLike
3,031FollowersFollow
0SubscribersSubscribe

Latest Posts