జనసేన, బీజేపీ రోడ్‌ మ్యాప్ సిద్ధం: పవన్ కళ్యాణ్

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చెయ్యొద్దని, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి లకు ఢిల్లీలో వినతిపత్రం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్.

ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితిని వివరించి, దేవాలయాలపై దాడులు గురించి మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విశాఖ ప్లాంట్ గురించి చర్చించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు.

స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని కిషన్ రెడ్డిని, అమిత్ షా గారిని కోరినట్లుగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మార్చి నెలలో బీజేపీ, జనసేన పార్టీలు కోర్ కమిటీ మీటింగ్‌లు ఉంటాయని, జనసేన-బీజేపీ రోడ్ మ్యాప్‌పై మార్చి 3వ తేదీన చర్చిస్తాం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

మరోసారి అమిత్‌షాతో భేటీ తర్వాత తిరుపతి బై ఎలక్షన్‌పై స్పష్టత ఇస్తామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మార్చి 3, 4 తేదీల్లో జనసేన, బీజేపీ రోడ్‌ మ్యాప్ సిద్ధం చేసుకోనున్నట్లు చెప్పారు.

ఏపీలో శాంతిభద్రతల పరిస్థితిని అమిత్‌ షాకు వివరించానని, దేవాలయాలపై దాడుల విషయాన్ని అమిత్‌ షా దృష్టికి తీసుకు వెళ్లామని పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఇక, తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పార్టీ ఏర్పాటుపై మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చని షర్మిల ఇంకా పార్టీ ప్రారంభించ లేదు కదా! పార్టీ విధి విధానాలు వచ్చాక మాట్లాడుదాం అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, తెలంగాణలో షర్మిల కూడా పార్టీ పెట్టొచ్చని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

కెసిఆర్ పాలన గురించి హైదరాబాద్లోనే మాట్లాడతాను అంటూ పేర్కొన్న పవన్ కళ్యాణ్ హస్తిన వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.