చేతకాకపోతే తప్పుకోండి

14

తిరుపతి రెండో రోజు పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలచెరువు రోడ్డులోని రైతు బజారును సందర్శించారు. అక్కడ ఉల్లి కోసం బారులు తీరిన ప్రజలతో పవన్ మాట్లాడి ఉల్లి కోసం వారు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… ఉల్లి కష్టాలు ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. జగన్ సర్కార్ కు భవనాలు కూలగొట్టడంలో ఉన్న శ్రద్ధ ప్రజల కష్టాలపై పెట్టి ఉంటే బాగుండేదని ఆక్షేపించారు. ఇసుక కోసం ఎన్ని కష్టాలు పడ్డారో.. ఈరోజున ఉల్లి కోసం ప్రజలు అంతే అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.