పాపం, ఆయనకు ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో?

కాకినాడలో గాయపడ్డ తమ కార్యకర్తలను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు పరామర్శించిన విషయం తెలిసిందే. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గురించి ఆయన్ని ప్రశ్నించారు. ‘మీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మీరు ఏం చెప్పినా దానికి కౌంటర్ ఇస్తున్నారు?’ అని పవన్ ని ప్రశ్నించగా, ‘పాపం, ఆయనకు ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో చెప్పలేం కదా..’ అని సమాధానమిచ్చారు.

కొత్త వార్తలు