మంత్రి కొడాలి నానికి పేకాట క్లబ్బులపై ఉన్న శ్రద్ధ రోడ్లు బాగుచేయడంలో లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. గుడివాడలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, ఈ సమస్యపై ప్రజలు ఎమ్మెల్యేను నిలదీయాలని సూచించారు. కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్న ఆయన గుడివాడకు రాగానే కొడాలినానిపై విమర్శలు చేశారు. ప్రజలను భయపెట్టి పాలిస్తే భరించరని తెలిపారు. తన అంతిమ శ్వాస ఉన్నంతవరకూ ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.
ఒకవైపు కొడాలి నాని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ మీ సీఎం షాప్ జగన్ రెడ్డి కి చెప్పు ఈ వకీల్ సాబ్ చెప్పాడని అంటూ కామెంట్లు చేశాడు. పవన్ కామెంట్లను బాగా ఎంజాయ్ చేస్తున్న జనసేన అభిమానులు మరోవైపు వైసీపీ అభిమానులు కొడాలి నాని ప్రెస్ మీట్ కోసం ఎదురుచూస్తున్నారు