Breaking News :

బీజేపీ – జనసేన దోస్తీ: మరో సంకేతం ఇచ్చిన పవన్!

ఆంద్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల తరువాత రాష్ట్రంలో నిత్యం పర్యటనలు చేస్తూ, ప్రజలందరితో మమేకం అవ్వడనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రవర్తనా తీరు చూస్తుంటే అందరికి ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నడూలేని విధంగా ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీపార్టీ పైన దారుణంగా విమర్శలు చేస్తూనే, బీజేపీ పార్టీ పై చాలా సానుకూలమైన ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ ప్రవర్తన అంత చూస్తుంటే… జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడా లేక బీజేపీలో తన పార్టీ ని విలీనం చేస్తాడా అనే అనుమానం కలుగుతుంది.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి వీలు దొరికినప్పుడల్లా మోడీని, అమిత్ షా ని, పొగుడుతూ బీజేపీ కి మద్దతుగా పలు వాఖ్యలు చేస్తున్నారు. కాగా తాజాగా పవన్ చిత్తూరు జిల్లా పర్యటనలో ఆర్ఎస్ఎస్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ, పార్టీ ని ఆర్ఎస్ఎస్ తరహాలో అభివృద్ధి చేయాలని పవన్ సూచించారు. దానికి తోడు ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు పవన్ కల్యాణ్ సైనిక కుటుంబాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆ కోటి రూపాయలకు సంబందించిన డిడిని తానే స్వయంగా వెళ్లి ఢీల్లీలో అధికారులకు అందిస్తానని చెప్పుకొచ్చారు. దానికి తోడు తనకి ఈ బాధ్యతను గుర్తు చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్…

ఇకపోతే ఈ మధ్య కాలంలో బీజేపీకి తన వంతుగా పరోక్ష మద్దతు తెలుపుతూ… బీజేపీ కి తానూ ఎన్నడూ కూడా దూరంగా లేనని కొత్తగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంతలా బీజేపీ పై పొగడ్తలు చేస్తూ, బీజేపీ నేతల దయ పొందడానికి కష్టపడుతున్నారో అర్థం కానీ విషయంగా ఉండిపోయింది. అయితే బీజేపీతో పొత్తు ద్వారా పార్టీని ఏపీలో విస్తరించాలనుకుంటున్నారా, లేక జనసేన పార్టీ ని బీజేపీలో విలీనం చేసి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగాలనుకుంటున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది.

Read Previous

ఢిల్లీ మెట్రో రైల్లో రొమాన్స్

Read Next

నా ఫ్యాన్స్ వల్లే ఓడిపోవాల్సివచ్చింది: పవన్