బీజేపీ మిషన్ 2024: సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్

గత ఎన్నికల్లో వైకాపా అఖండ విజయం సాధించగా ప్రజల్లో చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న వ్యతిరేకత పూర్తిస్థాయిలో భయపడిపోయింది. టీడీపీ 23 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలకే పరిమితమే పునాదులతో సహా కదిలిపోయింది. ఈ ఫలితాలతో ఏపీలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని స్పష్టమైంది. ఈ ఖాళీని పూరించాలని భాజాపా పావులు కదుపుతోంది. ఎన్నికల్లో అస్సలు ప్రభావం చూపలేకపోయినా రానున్న ఐదేళ్లలో గట్టిగా పనిచేసి టీడీపీకి ప్రత్యాన్మాయంగా ఎదగాలని, వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షంగా మారాలని భావిస్తోంది.

అదే గనుక జరిగితే జనసేనకు రాష్ట్ర రాజకీయాల్లో చోటు దక్కడం కష్టమవుతుంది. కాబట్టి గత ఎన్నికల్లో కొద్ది మొత్తంలోనే ఓట్ షేర్ సాదించినప్పటికీ మూడో పార్టీగా అవతరించిన జనసేనను పవన్ ఈ ఐదేళ్లు జనంలోనే ఉండి సమర్థవంతంగా నడపగలిగితే భాజాపా కంటే వేగంగా టీడీపీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోగలుగుతారు. పరిస్థితులు ఎప్పుడైనా మారిపోవచ్చు కాబట్టి వాటి నుండి ప్రయోజనం పొందగలుగుతారు.

ప్రస్తుతం రాజధాని పర్యటనలో పవన్ జగన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజధానిని మారుస్తే ప్రధాని మోదీ, అమిత్ షాను కలుస్తానని ప్రకటించారు. అంతేకాదు ఇద్దరిని ప్రశంసలతో ముంచెత్తారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ లో మార్పు.

కొద్ది రోజులుగా జనసేనను పవన్ భాజాపాలో విలీనం చేస్తారనె వస్తున్న వార్తలను పవన్ ఖండించారు. తాను జనసేనను ఏపార్టీలో విలీనం చేయనని ప్రకటించారు.కొద్ది రోజులుగా పవన్ తీరులో మార్పు కనిపిస్తోంది. గతంలో ప్రధాని మీద ఘాటుగా విమర్శలు చేసిన పవన్..ఇప్పుడు ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షా ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

జగన్ ను ఢీ కొట్టాలంటే పవన్ ఎంత వరకు ప్రభావం చూపుతాడనేది ప్రశ్నగా మిగిలివుంది. అంతేకాదు బలమైన క్యాడర్, ఆర్థిక స్థోమత జనసేన పార్టీకి లేదు. జాతీయ పార్టీ మద్దతు అవసరం. ఏపీలో పాగా వేయాలని చూస్తున్న భాజాపాకు పవన్ మద్దతు చాలా అవసరం.

తానా సభల సమయంలో అమెరికాలో బీజేపీ ముఖ్య నేత రాంమాధవ్ జనసేన అధినేత పవన్ తో కీలక భేటీ జరిగింది. ఆ తరువాత పవన్ వ్యాఖ్యల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. టీడీపీలో ఎమ్మెల్సీ గా ఉన్న అన్నం సతీస్ తన పదవికి రాజీనామా చేసి భాజాపాలో చేరిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆయన చేసన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ కలకలం రేపుతున్నాయి. బీజేపీ సీఎం అభ్యర్ధి పవన్ కళ్యాన్ అంటూ.. డిసెంబర్ లోగా జనసేన బీజేపీలో విలీనం అవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ లోగా బీజేపీలో జనసేన కలుస్తుందని జోస్యం చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వస్తారని.. ఆయన కోసం ఢిల్లీ నాయకులు సైతం ఏపీకి వస్తారని చెప్పుకొచ్చారు

పార్టీ విలీనం చేయగానే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి అవుతారని.. ఇప్పుడు వీటి మీద ఏపీలో రాజకీయంగా ఆసక్తికర చర్చ మొదలైంది. బీజేపీలో పవన్ చేరితే ఆయన బలం అమాంతం పెరుగుతుందని… ఆ తర్వాత ఆయనను ఎవరూ ఆపలేరని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందని ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్త పడుతున్నారని చెప్పారు. ఢిల్లీ నేతలు పవన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఏపీలో భాజాపా వ్యూహాత్మకంగా ముందుకెల్తున్నట్లు కనిపిస్తోంది. పవన్ ను పార్టీలోకి లాగేందుకు ఆచి తూచి అడుగులు వేస్తోంది.