జగన్ 100 రోజుల పాలనపై జనసేన రివ్యూ.. మరింత దూకుడు పెంచాలని నిర్ణయం

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి దిండి లో తమ నేతలతో సమావేశమయ్యారు. పలు ముఖ్య విషయాలను చర్చించి తమ వ్యవహాలను అక్కడి నేతలతో పంచుకున్నారు. జగన్ 100 రోజుల పాలన పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జగన్ పాలనా విధానంలో మార్పులు గమనించిన పవన్ ఇక పై దూకుడు స్వభావాన్ని మేధస్సు తో పోరాడనున్నారు.

పార్టీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు పవన్ కళ్యాణ్. జనసైనికులు ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలవాలని తెలిపారు. ఏ విషయం లోనైనా కూలంకషంగా చర్చించి దానికి తగ్గ పరిణామాలను సమన్వయము చేసుకుంటూ ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే ప్రజలకు న్యాయబద్ధమైన సేవ ని అందించవచ్చు అని అన్నారు.

పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ని ఆదేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ గారి భావాలూ, విధి విధానాలు, ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జనసేన నాయకులూ కృషి చేయాలనీ తెలిపారు. జగన్ పాలన కు సంబంధించి సంక్షేమ పథకాలు, ప్రజలకి ఇబ్బంది క్రమంగా లేకుండా చేరుట పట్ల జనసైనికులు అంత ఒక్కటై పని చేయాలన్నారు.

పార్టీ పైన కానీ, అధినేత పవన్ కళ్యాణ్ పైన కానీ ఎవరైనా అసత్యాలు పాల్పడితే వాటిని బలంగా తిప్పికొట్టాలని, రాష్ట్ర స్థాయి నుండి గ్రామా స్థాయి వరకు జనసేన పార్టీ ని బలోపేతం చేయడానికి అధినేత పలు వ్యూహాలు రచిస్తున్నారని తెలిపారు.