సోలోగా జనసేన – అంటే పొత్తు కేవలం ఏపీకే పరిమితమా ?
Timeline

సోలోగా జనసేన – అంటే పొత్తు కేవలం ఏపీకే పరిమితమా ?

కార్యకర్తల కోరిక మేరకు తెలంగాణ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయనుందని పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. పలుడివిజన్లలో జనసైనికుల క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని, వారి ముందుకు సమస్యలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. వారి కోరిక మేరకు జనసేన తరపున అభ్యర్థుల్ని నిలుపుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవ్వాలని జీహెచ్‌ఎంసీ నగర పరిధిలో కమిటీలకు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.

కొసమెరుపు :

ఇంతకీ జనసేన – బీజేపీ పొత్తు ఏమైందో ఎవరికి అర్ధం కావట్లేదు. ఈ లెక్కతో ఆ పొత్తు కేవలం ఆంధ్ర ప్రదేశ్ కి మాత్రమే పరిమితం అనే సంకేతం ఇస్తున్నారా బీజేపీ, జనసేన నేతలు. పొత్తు లేనప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఎందుకు కలిసినట్టు , ఆయా మీటింగ్ కేవలం దుబ్బాక ఎన్నికల ముందు పవన్ అభిమానుల మనసు దోచుకోడానికేనా అంటూ పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇలా పొత్తు లేకుండా GHMC ఎన్నికల్లో విడి విడిగా పోటీ చేస్తే లాభం తెరాస కె దక్కుతుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా