Breaking News :

బ్రేకింగ్: జగన్ దెబ్బకు పువ్వు పట్టుకోనున్న జేసీ

ఏపీ రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి కీలకమైన నేతల్లో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా ఒకరు.ఉన్నది ఉన్నట్టుగా నిర్మహమాటంగా ముక్కుసూటిగా చెప్పేస్తారు.అలా గతంలో తాను ఉన్న పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపైనే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.అలాగే అప్పటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ అధినేత వై ఎస్ జగన్ పై కూడా తీవ్ర స్థాయి ఆరోపణలు చేసారు.అయితే అప్పుడు ఆయన టైం నడిచింది.

కానీ ఇప్పుడు జగన్ కు టైం వచ్చింది.సో అధికారంలో ఉన్న జగన్ తాను జేసీను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అలా చేస్తున్నారని ఇప్పుడు ఒక టాక్ వినిపిస్తుంది.అందువల్లే జేసీ ఆ మధ్య టీడీపీ పార్టీను వీడడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాలు నుంచి తప్పుకుంటున్నానని సంచలన ప్రకటన కూడా చేసారు.అయినప్పటికీ జేసీ పై జగన్ కన్ను తిప్పలేదని అలాగే జేసీ కు అన్ని వైపులా ఉచ్చు బిగించడం మొదలు పెట్టాడని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఈ దెబ్బ మూలానే ఇప్పుడు జేసీ బీజేపీ జపం చేస్తున్నారని తాను ఇప్పుడు టీడీపీలో మళ్ళీ చేరితే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసీ తనకి వైసీపీలో చోటు దక్కదని కన్ఫర్మ్ చేసుకొని కేంద్ర స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీలో ఉంటేనే జగన్ నుంచి ఇబ్బందులు తనకు తప్పుతాయని జేసీ బీజేపీలో చేరాలని ఒక సంచలన నిర్ణయం తీసుకోవాలని భావించినట్టుగా రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.మరి ఈ వార్తల ప్రకారమే జేసీ కూడా బీజేపీ కండువా కప్పుకుంటారో లేదో చూడాలి.

Read Previous

బుల్లితెరపై బ్రహ్మాజీ… ప్రోమో అదిరింది

Read Next

జగన్ కి కత్తి మహేష్ కౌంటర్