జగన్ పనికి జేడీ ప్రశంస.. అది మేలు చేసేదే
Timeline

జగన్ పనికి జేడీ ప్రశంస.. అది మేలు చేసేదే

ఎవరికైనా ప్రత్యర్థులు పొగుడుతున్నారంటే ఆ ఆనందమే వేరు. అది రాజకీయాల్లో కానివ్వండి…ఇంకేదైకానివ్వండి. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారరాయణ ప్రశంసలు కురిపించడం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. జగన్ తన మ్యానిఫెస్టోలో దశలవారీగా మధ్య పాన నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే ఈ మద్యపాన నిషేధం అమలు చేయడం సాధ్యమయ్యే విషయం కాదని ఏకంగా జనసేన అధినేత కూడా చెప్పుకొచ్చారు కూడా. కానీ అదే పార్టీలో ఉన్న మాజీ జేడీ మాత్రం ఈ పథకం విషయంలో జగన్ మీద ప్రశంసలు కురిపించారు.

లక్ష్మీనారాయయణ మాట్లాడుతూ.. మధ్య పాన నిషేధం దిశగా జగన్ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాన్ని ఇస్తాయని, సమాజానికి ఇది ఎంతో మేలును కలుగుజేస్తుందని చెప్పుకొచ్చారు. రాజకీయాలో ప్రత్యర్థి మీద విమర్శలు తప్పితే ప్రశంసలు రావటం ఈ రోజుల్లో అసాధ్యం అయిపోయింది.

కానీ జేడీ మాత్రం సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా జగన్ ను మెచ్చుకోవటం రాజకీయాల్లో మంచి శుభ పరిణామం అని చెప్పాలి. ఇప్పటికే జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టే మద్యపాన నిషేధం దశల వారీగా విధించడానికి చర్యలు మొదలుపెట్టారు. తోలి విడతలో ప్రభుత్వం అన్ని ప్రైవేటు లైసెన్సులను రద్దు చేసి .. వైన్ షాపులను తమ ఆధీనంలోకి తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published.