దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈసారి నాలుగు విడుతల్లో జేఈఈ మెయిన్ నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్ణయించింది. అర్హులైన విద్యార్థులు నేటి నుంచి 2021, జనవరి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22 నుంచి 25వ తేదీ వరకు, రోజుకు రెండు విడుతల్లో ఆన్లైన్లో జేఈఈ మెయిన్ మొదటి పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి, ఏప్రిల్, మేలో మరో మూడు విడుతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇతర వివరాల కోసం jeemain.nta.nic.in వెబ్సైట్ను సందర్శించొచ్చు.
