రియా అరెస్ట్: రిపబ్లిక్ టీవీ లో ఉద్యోగం మానేస్తున్నాను
Timeline

రియా అరెస్ట్: రిపబ్లిక్ టీవీ లో ఉద్యోగం మానేస్తున్నాను

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని టీవీ చానళ్లు ఎలా టి ఆర్ పి ల కోసం వాడుకుంటున్నాయి అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. సుశాంత్ మరణానికి రియా కారణమంటూ ఒక వర్గం, ముఖ్యంగా ఇందులో బీజేపీకి అనుకూలంగా మాట్లాడేవారు ఉండటం గమనార్హం. సుశాంత్ కుటుంబం మరియు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఈ వ్యాఖ్యలను ప్రోత్సహిస్తూ వస్తుంది.

ఈ వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నట్టు గా రిపబ్లిక్ టీవీ న్యూస్ కవరేజ్ చేయడం ఇప్పుడు పెద్ద డిబేట్ గా మారింది. బాలీవుడ్ ను టార్గెట్ చేస్తూ arnab goswami మరియు నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ రచ్చ గా మారింది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో రిపబ్లిక్ టీవీ కవరేజ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్ రియాని అవమానించేలా, తనను తప్పుడు యాంగిల్ లో చూపించడం ఇదంతా రిపబ్లిక్ టీవీ కావాలనే చేస్తోందని కామెంట్లు మొదలయ్యాయి.

ఈ విషయం నిజమే అంటూ రిపబ్లిక్ టీవీ లో పనిచేస్తున్న కొందరు జర్నలిస్టులు వాళ్ల ఉద్యోగాలకు రాజీనామా చేసి ట్విట్టర్ వేదికగా వారి అభిప్రాయాలను తెలిపారు.

వారికి వస్తున్న సమాచారం , రిపబ్లిక్ టీవీ లో చూపిస్తున్న సమాచారానికి ఛానల్ అజెండా కి ఎటువంటి సంబంధం లేదని, అన్నీ అబద్ధాలే అంటూ ఛానల్ కార్యకలాపాలను బయటపెట్టారు

రిపబ్లిక్ టీవీ లో పనిచేస్తున్న శ్శాంతశ్రీ ఈ కామెంట్లు చేశారు. ఇలా నిర్భయంగా ముందుకు వచ్చి ఈ విషయాన్ని చెప్తున్నందుకు ఆమెను జర్నలిస్టులు అందరూ అభినందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.