TV5 To V6: జర్నలిస్ట్ సౌజన్య జంప్

సీనియర్ జర్నలిస్ట్ ‘సౌజన్య నగర్’ ప్రస్తుతం తెలుగు టాప్ ట్రెండ్ జర్నలిస్ట్ జాబితాలో ఒకరు. న్యూస్ ప్రెసెంట్ చెయ్యడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. సమగ్ర విశ్లేషణ, తడబాటు లేని స్వరం, వార్తలని వేగవంతంగా చెప్పడం, ప్రశాంతంగా కనిపించే ముఖం జర్నలిస్ట్ సౌజన్య కు అదనంగా ఉండే ప్రత్యేకమైన లక్షణాలుగా చెప్పచ్చు. ప్రస్తుతం టివీ5 లో రాణిస్తున్న సౌజన్య, ‘ఫటాఫట్’ న్యూస్ తో వార్తల స్టైల్నే మార్చేసింది. ఈ ప్రోగ్రాం కూడా ఆమెకు చాలా పాపులారిటీ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం సౌజన్య ప్రముఖ ఛానల్ V6 లోకి వెళ్తున్నట్లుగా సమాచారం. సౌజన్య గడిచిన రోజులుగా గమనిస్తే న్యూస్ ప్రెజెంటేషన్ లోకి రావడం లేదు. ఎంత బిజీగా ఉన్న ‘ఫటాఫట్’ న్యూస్ కి వచ్చే సౌజన్య ప్రస్తుతం కనిపించడం లేదు. అంతేకాకుండా ఆ ప్రోగ్రాంకి మరొక న్యూస్ యాంకర్ రావడం, సౌజన్య సమాచారం గూర్చి టివీ5 ఛానల్ స్పందించకపోవడంతో ఆమె V6 ఛానల్ తో కలిసి వెళ్ళడానికి రంగం సిద్దంచేసుకున్నట్లుగా మీడియా వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.

కొత్త వార్తలు

సినిమా

రాజకీయం