Breaking News :

ఆ ఛానల్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టనున్న స్వప్న

జర్నలిస్టులకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ జర్నలిస్టులైన.. దేవులపల్లి అమర్, సజ్జల రామకృష్ణారెడ్డి, రామచంద్రమూర్తి లను ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. తాజాగా మరో సీనియర్ జర్నలిస్ట్ స్వప్న కు కీలక పదవి కట్టబెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన మీడియా అయిన svbc ఛానల్ కు డైరెక్టర్ గా ఆమెను నియమించినట్టు తెలుస్తోంది.

నాలుగు రోజుల కిందటే ఏపీ ప్రభుత్వం ఆమెకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో మంచి ముహూర్తం చూసుకొని svbc డైరెక్టర్ గా స్వప్న బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. మరోవైపు నామినేటెడ్ పదవుల కోసం వైసీపీ నేతలు సీఎంఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల తరువాతనే పదవుల పంపకం ఉంటుందని పార్టీ అధిష్టానం వారికి చెబుతున్నట్టు తెలుస్తోంది.

Read Previous

సీఎం సీరియస్: అడ్డుకుంటే అరెస్ట్ చేయండి

Read Next

ఫాస్ట్ : జియో కొత్త ఆఫర్ – అర్జెంటుగా రీఛార్జ్ కరో