TV9 రజినీకాంత్ రాజీనామా – ఏది వైరల్ – ఏది నిజం ?
Timeline

TV9 రజినీకాంత్ రాజీనామా – ఏది వైరల్ – ఏది నిజం ?

ఈరోజు ఉదయం నుండి టాప్ తెలుగు జర్నలిస్ట్ రజినీకాంత్ TV9 ఛానల్ కి రాజీనామా చేసేశారని వార్తలు షికారు చేసాయి.

అయితే టీవీ9 ఛానల్ కు ఆయన రాజీనామా చేయడానికి గల కారణం ఆ ఛానల్ టీఆర్పీ రేటింగులు పడిపోవడం, రవి ప్రకాష్ తో ఇంకా టచ్ లో ఉండటం ఇవన్నీ కొత్త యాజమాన్యానికి మింగుడు పడకపోవడంతో , అదే ఛానల్ లో పని చేస్తున్న మరొక జర్నలిస్ట్ మురళి కృష్ణ కు బాధ్యతలు ముట్టజెప్పి , రజినీని తప్పించారంటూ వార్తలు ప్రచురించాయి కొన్ని వెబ్ సైట్లు.

అయితే ఆయన ఇలా ఔట్ అని వార్త ప్రచారం అయ్యేలోపే V6 సీఈఓ TV9 కి వెళ్ళబోతున్నట్టు , కాదు కాదు భక్తి టీవీ CEO అని ఇంకొన్ని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.

అయితే ఇందులో నిజమెంత అని తెలుగు సర్కిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేయగా, ఒక టాప్ సోర్స్ నుండి అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు అయితే రజినీకాంత్ రాజీనామా చేయలేదని, ఈరోజు 10 గంటల వరకు ఆఫీసులోనే ఉన్నారని, కేవలం జగన్ తిరుమల న్యూస్ ని కవర్ చేసేందుకే బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ షో ఈరోజు టెలికాస్ట్ చేయలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అబద్దమని తెలిసింది.

ఇదంతా కొందరు కావాలని ఛానల్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే ఈ వార్తలను సృష్టిస్త్తున్నారని తెలిపారు .

అయితే మంట లేనిదే పొగ రాదుగా , ఈమధ్య కాస్త రజినీకాంత్ కూడా యాజమాన్యం పై అలిగారని, ఎందుకో కానీ కొన్ని వ్యవహారాలు ఆయనకు నచ్చట్లేదని , దీని విషయం పై చర్చించేందుకే ఛానల్ యజమానిని వెళ్లి స్వయంగా కలిసారని సమాచారం.

ఛానల్ యాజమాన్యం రజినీని పంపే ఆలోచనలో లేదని, యాజమాన్య కూడా రజినీని వెళ్ళొద్దని , అలంటి ఆలోచన ఉంటె మానుకోవాలని సూచించారట. ఏది ఉన్నా పరిష్కరించుకోవచ్చని తెలిపారట.

మొత్తానికి ఇంకా బాల్ రజిని కోర్టులోనే ఉందని సమాచారం. ఒకవేళ వెళితే ఇద్దరికీ నష్టమే , ఎందుకంటె ఏ ఛానల్ కూడా తీసుకునే ధైర్యం చేయదు, TV9 కి కూడా రజిని లాంటి జర్నలిస్టులు దొరకరు. ఒకరి కోసం ఒకరు ముందుకు సాగడమే దారి అనేది మీడియా వర్గాల్లో చెప్తున్న మాట.

ఏది ఏమైనా – ఇందులో ఏది వైరల్ ఏది నిజం అనేది వాళ్ళంతట వాళ్ళు స్వతహాగా ప్రకటిస్తే కానీ చెప్పలేము.

మరో కొసమెరుపు

రవి ప్రకాష్ ఛానల్ నుండి వెళ్ళిపోయినపుడు ప్రజలు సంతోషించారు సోషల్ మీడియాలో – రజినీకాంత్ వెళ్ళిపోయాడు అని తెలియగానే కొంత మంది TV9 లో ఇంతకుముందు పని చేసిన వారు సంతోషపడటం , ఆనందంలో ట్వీట్లు చేయడం ఇక్కడ కొసమెరుపు.

వారి ప్రైవసీ దృష్ట్యా ఆ ట్వీట్స్ ఇక్కడ షేర్ చేయట్లేదు