న్యూస్ కవర్ చేస్తున్న సమయంలో రిపబ్లిక్ టీవీ రిపోర్టర్.. మిగతా చానల్ సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారు దాడికి పాల్పడ్డారని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

బాలీవుడ్ డ్రగ్స్ కేసుని కవర్ చేయడానికి ఎన్‌సీబీ కార్యాలయానికి వివిధ చానళ్లకు చెందిన జర్నలిస్టులు, రిపోర్టర్లు, కెమెరామెన్‌లు . జర్నలిస్టులంతా న్యూస్ కవర్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇంతలో రిపబ్లిక్ టీవీకి చెందిన ప్రదీప్ భండారి అనే రిపోర్టర్.. తన చానల్ కెమెరాను మిగతా రిపోర్టవైపు తిప్పి  ‘‘వీళ్లు మానసిక రోగులు. ఛాయ్, బిస్కెట్ల కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్లు నిజాలు చెప్పరు. మేము మాత్రమే నిజాలు చూపిస్తాం’’ అని వ్యాఖ్యానించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మిగతా చానల్స్ జర్నలిస్టులు ‘‘రిపోర్టింగ్ చేసుకో, కాస్త జాగ్రత్తగా మాట్లాడు’’ అని హెచ్చరించారు.

అయినప్పటికీ భండారి వ్యాఖ్యలతో సహనం కోల్పోయిన జర్నలిస్టులు.. అతడిపై దాడికి దిగారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని ఆపి పరిస్థిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసారు

. అయితే ఎన్‌డీటీవీ, ఎబీపీ న్యూస్ చానళ్లకు చెందిన గూండాలు తనపై దాడి చేశారని ప్రదీప్ ట్విట్టర్ ద్వారా రివర్స్ గేమ్ మొదలుపెట్టాడు. తనకు సపోర్ట్ గ్యాంగ్ , బీజేపీ లీడర్లు ట్వీట్లు పెట్టారు.

ఎన్డీటీవీకి చెందిన సౌరబ్ గుప్తా.. ‘ఎన్డీటీవీ సిబ్బంది ఎంతో బాధ్యతాయుతంగా సరిగానే ప్రవర్తించారు’’ అని సమర్ధించుకున్నారు.

అయితే బండారిపై చేజేసుకున్న వ్యక్తి ఎన్డీటీవీ జర్నలిస్టు అంటూ సోషల్ మీడియా లో ప్రచారం చేసింది రిపబ్లిక్ టీవీ భజన బ్యాచ్ . అయితే ఆటను ఎన్డీటీవీ రిపోర్టర్ కాదని అసలు జరిగింది వేరని న్యూస్ లాండ్రి డిజిటల్ పత్రిక ప్రచురించింది.

మొన్నటికి మొన్న రిపబ్లిల్ల్ల్