ఇక టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ఎన్ఠీఆర్ అభిమానులు?
Timeline

ఇక టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ఎన్ఠీఆర్ అభిమానులు?

తెలుగు రాజకీయాల్లోనే కాదు భారత రాజకీయ చరిత్రలో అయన పేరు సువర్ణాక్షరాలతో లింకించబడింది. తెలుగు సినిమాను ఏలిన రారాజు ఎన్ఠీఆర్. అటు సినిమా జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని పీక్ స్టేజ్ లో చూసిన ఏకైక నటుడు, రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ఎన్ఠీఆర్ ఒక్కడే.

మళ్ళీ ఎన్ఠీఆర్ తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు, ప్రజల్లో గుండెల్లో చోటు సంపాదించుకున్న రాజకీయ నాయకుడు ఒక్క వైఎస్సాఆర్ మాత్రమే. ఇప్పటికీ అయన పేరు చెప్పితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల మొహాలపై చిరునవ్వు, కన్నీళ్లు కనబడుతాయి అంటే అతిశయోక్తి కాదు.

సీనియర్ ఎన్ఠీఆర్ కి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని, సీఎం అయిన చంద్రబాబు నాయుడు వైఎస్సాఆర్ వళ్ళ ఘోర పరాజయం చవి చూసారు 2004 ఎన్నికల్లో. వైఎస్సాఆర్ మరణం తరువాత ఆంధ్ర ప్రదేశ్, రెండు రాష్ట్రాలుగా విడిపోవటం, ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అటు మోడీ, ఇటు పవన్ కళ్యాణ్ హవాతో చంద్రబాబు 2014 లో జగన్ పై అతి స్వల్ప మెజారిటీతో గెలవడం జరిగింది.

వైఎస్సాఆర్ ని ఎదుర్కొనే శక్తి లేక జూనియర్ ఎన్ఠీఆర్ ని 2004లో రంగంలోకి దించారు. దానికి రెండు కారణాలు.. ఒకటి ఎన్ఠీఆర్ పేరుకి ప్రజల్లో ఉన్న క్రేజు, ఈ జూనియర్ ఎన్ఠీఆర్ కి దేవుడిచ్చిన గొప్ప వరం వాక్చాతుర్యం. ఈ రెండు చంద్రబాబుని ఎన్ఠీఆర్ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేశాయి.

అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోవడం వలనో ఏమో కానీ, లేదా తన తనయుడు లోకేష్ ఎదుగుదలకు అడ్డంగా ఉంటాడేమో అన్న భయమో కానీ జూనియర్ ఎన్ఠీఆర్ ని పక్కన పెట్టేసారు. అయితే 2019 ఎన్నికల్లో జూనియర్ ని రంగంలోకి దించే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.

ఒకటి జూనియర్ కి రాజకీయాలకు దూరంగా ఉండాలని తండ్రి చెప్పిన మాట అని కొందరు చెబితే, తన అనుకున్న వాళ్ళే తనను వాడుకొని పక్కన పెట్టేసి మోసం చేశారన్న బాధ ఇంకా ఎన్ఠీఆర్ మనసులో బలంగా ఉండిపోయిందనేది ఇంకొందరు చెప్పే వాదన. ఏది ఏమైనా అభిమానులకు మాత్రం ఎన్ఠీఆర్ ఎప్పుడు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటి వరకు అయితే జూనియర్ ఎన్ఠీఆర్ అభిమానులు కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తూనే వచ్చారు.

అయితే 2014 లో టీడీపీ గెలుపు తరువాత ఎక్కడ కూడా జూనియర్ ఎన్ఠీఆర్ పేరు వినబడకూడదు అనే నిర్ణయం పార్టీలో బలంగా తీసుకున్నారన్నది అభిమానుల చెవిన పడింది. అయినా ఎన్ఠీఆర్ పేరుపై ఉన్న అభిమానం, ఈ ఎన్ఠీఆర్ పై ఉన్న మమకారం తో అబిమానులు అన్నీ భరించారు.ఎవరు ఏమన్నా సరే ఓపిక పట్టారు. 2019 ఎన్నికల్లో తప్పకుండా టీడీపీ జండా కోసం అయన వస్తాడు అనుకున్నారు. రావాలనుకున్నారు. కానీ వారు ఆశించింది ఏది జరగలేదు.

వైస్సార్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి చేతిలో టీడీపీ నేతలు, చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఇక పార్టీ లేనట్టే అయిపోయింది ఆంధ్ర ప్రదేశ్ లో. 2019 ఎన్నికల్లో ఎన్ఠీఆర్ మౌనమే అభిమానులకు ఒక సంకేతం లా వెళ్ళింది. సోషల్ మీడియా లో కూడా కేవలం చంద్రబాబు , లోకేష్ అభిమానులే తప్ప జూనియర్ ఎన్ఠీఆర్ అభిమానులు వైసీపీ పై విమర్శలు చేయడానికి ఇష్టపడట్లేదు. అంతే కాకుండా రివర్స్ లో టీడీపీ నే విమర్శిస్తున్నారు.

వాళ్ళ దేవుడు అనుకున్న ఎన్ఠీఆర్ మౌనం వీళ్ళకు అర్ధం అయినట్టుంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. అంతే కాదు ఎన్ఠీఆర్ ని టీడీపీ పక్కన పెట్టినా సరే ఎన్ఠీఆర్ పై తన గౌరవాన్ని ఎన్నో ఇంటర్వ్యూల్లో జగన్ కుండబద్దలు కొట్టి చెప్పారు. ఆయనకు అన్యాయం జరిగిందని చెప్పారు. అందుకే ఇప్పుడొక కొత్త జిల్లాకు అయన పేరు పెట్టబోతున్నారు. అంతే కాకుండా జూనియర్ ఎన్ఠీఆర్ ని జగన్ అమ్మ ఒడి పథకానికి బ్రాండ్ అంబాసడర్ గా కూడా ఉండమని కోరినట్టు ఇన్సైడ్ సమాచారం.

మొన్న ఎన్ఠీఆర్ పుట్టిన రోజు నాడు కూడా మొదటి సారి లోకేష్ ట్వీట్ చేయడం, ఇదంతా కేవలం పార్టీకి మైలేజ్ తెచ్చుకోవడం కోసమే అన్నట్టు అభిమానులు ఫీల్ అయ్యి విమర్శలు కురిపించారు.

ఇక ఆల్మోస్ట్ టీడీపీ కాంపౌన్డ్ నుండి జూనియర్ ఎన్ఠీఆర్ అభిమానులు తప్పుకున్నట్టే అని సంకేతాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా లో కనబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.