RRR కోసం NTR డేరింగ్ డెసిషన్
Timeline

RRR కోసం NTR డేరింగ్ డెసిషన్

ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం బల్గెరియాలో భారీ ఎత్తున జరుగుతున్నది. ఎన్టీఆర్ కొమరం భీం సినిమాకు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. మరో నెలరోజులపాటు అక్కడే షూటింగ్ జరగబోతున్నది. అక్టోబర్లో RRR కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఈ లుక్ ఎలా ఉండబోతుందా అని అభిమానుల్లోనూ & సినిమా లవర్స్ లోను ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.

RRR సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. సాధారణంగా తెలుగులో ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పుకుంటే.. మిగతభాషల్లో డబ్బింగ్ ఆర్టిస్టుల చేత డబ్బింగ్ చెప్పిస్తారు. కానీ, ఈ సినిమాలో అలా కాదట. ఎన్టీఆర్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో కూడా డబ్బింగ్ చెప్పబోతున్నారని వినికిడి. ఇందులో ఎంతవరకు నిజం ఉందనే తెలియాల్సి ఉన్నది. నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పడం అంటే మాములు విషయం కాదు. చూద్దాం తారక్ ఎలా మెయింటైన్ చేస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.