మరో పెళ్లి చేసుకున్న దర్శకుడు కె రాఘవేంద్ర రావు కోడలు
Timeline

మరో పెళ్లి చేసుకున్న దర్శకుడు కె రాఘవేంద్ర రావు కోడలు

టాలీవుడ్ స్టార్ లెజెండ్రీ డైరెక్టర్ రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి నటుడిగా దర్శకుడిగా ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. కాని కమర్షియల్ సక్సెస్ లను మాత్రం అందుకోలేక పోతున్నాడు. సినీ కెరీర్ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ప్రకాష్ కోవెలమూడి ఆమద్య భార్య కనిక ధిల్లోన్ కు విడాకులు ఇచ్చిన విషయం తెల్సిందే. బాలీవుడ్ స్క్రీన్ ప్లే రైటర్ అయిన కనిక ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రకాష్ కొన్ని కారణాల వల్ల ఆమెతో విడిపోవడం జరిగింది. ప్రకాష్ తో విడిపోయిన తర్వాత కొన్నాళ్లకే రచయిత హిమాన్షు శర్మతో ప్రేమలో పడ్డట్లుగా వార్తలు వచ్చాయి. గత నెలలో కనిక.. హిమాన్షుల వివాహ నిశ్చితార్థం జరిగింది.

ఇటీవల వీరి పెళ్లి కూడా జరిగింది. అతి కొద్ది మంది బంధు మిత్రులు హాజరు అయిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో కనిక షేర్ చేశారు. పెళ్లి హడావుడి లేకుండా సింపుల్ గా హిందు సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఇక ఆమద్య ప్రకాష్ కోవెలమూడి కూడా రెండవ పెళ్లికి సిద్దం అవ్వబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఒక హీరోయిన్ తో ఆయన పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. కాని అవి పుకార్లే అంటూ తేలిపోయింది.

Leave a Reply

Your email address will not be published.